ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ
గాయం కారణంగా వన్డేలకు ఆర్చర్ దూరం
అహ్మదాబాద్: ఇప్పటికే టెస్టు సిరీస్, టి20 సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బతగిలింది. టీమిండియాతో జరగనున్న వన్డే సిరీస్‌కు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ దూరమయ్యాడు. మోచేతి గాయంతో జోఫ్రాఆర్చర్ వన్డే సిరీస్‌నుంచి వైదొలిగాడు. ఆదివారం ఇంగ్లండ్ ప్రకటించిన వన్డే జట్టులో ఆర్చర్‌కు స్థానం లభించలేదు. 14 మందితో కూడిన జట్టును ప్రకటించగా అందులో ఆర్చర్‌కు విశ్రాంతినిస్తూ ఇంగ్లండ్ టీమ్ మేనేజిమెంట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్చర్ స్వదేశానికి పయనమయ్యేందుకు సిద్ధమయాడు. మంగళవారం (మార్చి22)నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రాంభం కానుంది. ఆర్చర్ స్థానంలో క్రిస్ బాల్‌ను కానీ, క్రిస్ జోర్డాన్‌ను కానీ తుది జట్టులో ఆడించాలని ఇంగ్లండ్ భావిస్తోంది. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఇంగ్లండ్ ప్రకటించిన ప్రాబబుల్స్‌లో వీరికి ఇంకా చోటు కల్పించలేదు. వీరు ఇంకా వన్డే సిరీస్‌కు రిజర్వ్‌డ్ ఆటగాళ్లుగానే ఉన్నారు. కాగా ఆర్చర్ గాయంతో ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్‌లో ఆందోళన మొదలైంది.ఆర్చర్ ఎప్పటికి కోలుకుంటాడనే దానిపై స్పష్టత లేకపోవడంతో రాజస్థాన్ డైలమాలో పడింది. ఐపిఎల్ ఆరంభ మ్యాచ్‌లకు ఆర్చర్ అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు.
ఇంగ్లండ్ వన్డే జట్టు: ఇయాన్ మోర్గాన్( కెప్టెన్), మోయిన్‌అలీ, బెయిర్ స్టో,సామ్ బిల్లింగ్, జోస్ బట్లర్, సామ్ కరన్,టామ్ కరన్, లివింగ్ స్టోన్, మ్యాట్ పార్కిన్‌సన్, ఆదిల్ రషీద్,జేసన్ రాయ్, బెన్‌స్టోక్స్,రీస్ టోప్లే, మార్క్ వుడ్.
England team Announces for ODI Series against India