Sunday, December 22, 2024

భారత్‌లో అతడిని ముందుగా ఔట్ చేస్తే టెస్టు సిరీస్ గెలిచినట్టే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇంగ్లాండ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. టీమిండియాతో ఐదు టెస్టులు ఇంగ్లాండ్ జట్టు ఆడనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్‌నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. ఈ మధ్య బజ్‌బాల్ అంటూ ఇంగ్లాండ్ జట్టు దుమ్ములేపుతోంది. 2013 నుంచి ఇప్పటివరకు భారత జట్టు ఒక్క టెస్టు సిరీస్‌ను కూడా కోల్పోలేదు. భారత్ గడ్డపై టీమిండియా అద్భుతమైన రికార్డు ఉంది. ఇంగ్లాండ్ జట్టుకు మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ పలు సూచనలు చేశాడు. భారత్‌పై ఇంగ్లాండ్ సిరీస్ కైవసం చేసుకోవాలంటే హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను త్వరగా ఔట్ చేయాలని సూచించారు. స్పిన్ బౌలింగ్‌లో రోహిత్ బాగా ఆడుతాడని చెప్పాడు.

టర్నింగ్ పిచ్‌లలో డాన్ బ్రాడ్‌మాన్‌లా కనిపిస్తాడని ప్రశంసించారు. ఇండియా పిచ్‌లపై రోహిత్‌కు రికార్డు బాగుందని కొనియాడారు. రోహిత్ శర్మ ఔట్ చేసిన తరువాత ప్లాన్-బి వెళ్లాలని సూచించారు. రోహిత్‌ను ఔట్ చేస్తే యువ బ్యాట్స్‌మెన్లను ఒత్తిడిలోకి నెట్టవచ్చని సూచించారు. రవిచంద్రన్ అశ్విన్ విభిన్న బంతులను సంధిస్తాడని, అతడి బౌలింగ్‌లో రోజు రోజు పదును పెరుగుతుంది కానీ తగ్గడం లేదన్నారు. టర్నింగ్ పిచ్‌పై వికెట్ల తీయడం అంత సులభం కాదని, పరిస్థితులకు తగ్గట్లుగా మారిపోతాడని, అశ్విన్ యాప్‌లాంటి వాడని ప్రతి ఆరు నెలలకు ఒక సారి ఆప్‌డేట్ అవుతాడని పనేసర్ ప్రశంసించారు. అతడి బౌలింగ్‌లో జాగ్రత్తగా బ్యాటింగ్ చేయాలని సూచించారు. 2012-13వ సంవత్సరంలో ఇంగ్లాండ్ అలిస్టర్ కుక్ కెప్టెన్సీలో భారత్ పర్యటనకు వచ్చింది. గ్రేమస్వాన్ 20 వికెట్లు, పనేసర్ 17 వికెట్లు పడగొట్టి భారత్ సిరీస్‌ను ఇంగ్లాండ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ జట్టు కూడా భారత్ గడ్డపై టెస్టు సిరీస్ గెలవలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News