Wednesday, January 22, 2025

ఇంగ్లండ్ ఇన్నింగ్స్ విజయం

- Advertisement -
- Advertisement -

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కాగా, ఇంగ్లండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఈ మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. సుదీర్ఘ కాలంగా ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహించిన అండర్సన్ ఇంతకుముందే రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక వెస్టిండీస్ శనివారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌లో 47 ఓవర్లలో 136 పరుగులకే కుప్పకూలింది.

తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లతో చెలరేగిన గుస్ అట్కిన్సన్ ఈసారి మరో ఐదు వికెట్లను పడగొట్టాడు. కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్ ఆడిన అండర్సన్ మూడు వికెట్లను తీశాడు. కెప్టెన్ స్టోక్స్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఇక విండీస్ ఇన్నింగ్స్‌లో గుడాకెష్ మోటి (31) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా, విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 371 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News