Sunday, December 22, 2024

వెస్టిండీస్‌ పై ఇంగ్లండ్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

వెస్టిండీస్‌తో జరిగిన రెండో టి20లో ఇంగ్లండ్ ఏడు వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ విసయంతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 20 ఆధిక్యాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కెప్టెన్ రొమన్ పొవెల్ (43), రొమానొ షెఫర్డ్ (22) మాత్రమే కాస్త రాణించారు. మిగతా వారు విఫలయ్యారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 14.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్ విల్ జాక్స్ (38), లియం లివింగ్‌స్టోన్ 23 (నాటౌట్) రాణించారు. ఇక జోస్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. చెలరేగి ఆడిన బట్లర్ 45 బంతుల్లోనే 6 సిక్సర్లు, 8 ఫోర్లతో 83 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News