Monday, December 23, 2024

నేడు అఫ్గాన్‌తో ఇంగ్లండ్ ఢీ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఢిల్లీలో జరిగే మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో పసికూన అఫ్గానిస్థాన్ తలపడనుంది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమి పాలైన అఫ్గాన్‌కు బలమైన ఇంగ్లండ్‌తో జరిగే పోరు సవాల్‌గా మారింది. ఇక కిందటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ 137 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ ఆత్మవిశ్వాశం రెట్టింపు అయ్యింది. అఫ్గాన్‌పై కూడా గెలిచి ఆత్మవిశ్వాసా న్ని మరింత పెంచుకోవాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇంగ్లండ్ సమతూకంగా ఉంది. బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, కెప్టెన్ జోస్ బట్లర్, లివింగ్‌స్టోన్, హారి బ్రూక్, శామ్ కరన్ తదితరులతో ఇంగ్లండ్ బ్యా టింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక కరన్, వోక్స్, మార్క్‌వుడ్, రషీద్‌లతో బౌలింగ్ కూడా పటిష్టంగానే ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News