Tuesday, December 24, 2024

మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ సెమీ ఫైనల్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా

- Advertisement -
- Advertisement -

సిడ్నీ: మహిళల ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ 21 గోల్స్ తేడాతో కొలంబియాను ఓడించింది. మరో క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియా పెనాల్టీ షూటౌట్‌లో 76 తేడాతో ఫ్రాన్స్‌పై విజయం సాధించింది. ఇంగ్లండ్‌కొలంబియా జట్ల మధ్య జరిగిన పోరు చివరి వరకు ఆసక్తికరంగా సాగింది. ఇరు జట్లు అసాధారణ పోరాట పటిమను కనబరిచాయి. ఇటు ఇంగ్లండ్ అటు కొలంబియా మహిళలు గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించాయి. ప్రథమార్ధంలో గోల్స్ కోసం రెండు జట్లు కూడా సర్వం ఒడ్డాయి. ఎటాకింగ్ గేమ్‌తో ఇరు జట్ల క్రీడాకారిణిలు అభిమానులను కనువిందు చేశారు. తొలి హాఫ్ 44వ నిమిషంలో కొలంబియా తొలి గోల్‌ను నమోదు చేసింది. లీసి సాంటోస్ అద్భుత గోల్‌తో కొలంబియాకు ఆధిక్యం అందించింది. అయితే ఈ ఆనందం కొలంబియాకు ఎంతో సేపు నిలువలేదు. ప్రథమార్ధం ఇంజ్యూరీ టైమ్‌లో ఇంగ్లండ్ క్రీడాకారిణి లౌరెన్ హెంప్ చిరస్మరణీయ గోల్‌ను సాధించింది.

దీంతో తొలి హాఫ్‌లో స్కోరు 11తో సమంగా నిలిచింది. ద్వితీయార్ధంలో కూడా ఇంగ్లండ్‌కొలంబియా జట్లు అద్భుత ఆటను కనబరిచాయి. గోల్ కోసం తీవ్రంగా పోరాడాయి. 63వ నిమిషంలో ఇంగ్లండ్ ప్రయత్నం ఫలించింది. అలెసియా రొస్సొ అద్భుత గోల్ సాధించింది. దీంతో ఇంగ్లండ్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత కూడా ఇంగ్లండ్ దూకుడుగా ఆడింది. మరోవైపు కొలంబియా స్కోరును సమం చేసేందుకు సర్వం ఒడ్డింది. అయినా ఫలితం లేకుండా పోయింది. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న ఇంగ్లండ్ 21 తేడాతో గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లింది. మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పెనాల్టీ షూటౌట్‌లో జయకేతనం ఎగుర వేసింది. ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 76తో విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్స్ సాధించడంలోవిఫలమయ్యాయి. ఎక్స్‌ట్రా సమయంలో కూడా గోల్స్ నమోదు కాలేదు. దీంతో పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితాన్ని తేల్చారు. ఇందులో ఆస్ట్రేలియా విజయాన్ని అందుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News