Sunday, January 5, 2025

నేడు ఇంగ్లాండ్ తో భారత్ పోరు

- Advertisement -
- Advertisement -

కేప్‌టౌన్ : ఐసిసి మహిళ టి20 వరల్డ్ కప్ టీమిండియా అమ్మాయిలు విజయ ఢంకా మోగిస్తున్నారు. వరుస గెలుపులతో దూసుకుపోతున్నారు. అందులో భాగంగా శనివారం జరిగే పోరులో మాజీ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది. ఇప్పటికే ఆడిన పాకిస్తాన్, వెస్టిండీస్‌లతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత్ ఇంగ్లండ్‌పై విజయం సాధిస్తే దాదాపుగా సెమీఫైనల్స్‌కు చేరుకుంటుంది. అయితే ఇంగ్లండ్ అటు బౌలింగ్ బ్యాటింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఇక ఇంగ్లండ్ కూ డా తాను ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజ యం సాధించి పాయింట్ల పట్టికలో అగ్ర భాగంలో ఉంది. ఈ క్రమంలో శనివారం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. అయితే టీమిండియాను స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఫామ్ కలవరపెడుతోంది.

గతేడాది జరిగిన ఆసియా కప్‌లో అదరగొట్టిన స్మృతి ప్రస్తుతం పెద్దగా బ్యాట్‌తో రాణించలేదు. అడపాదడపా అర్ధ సెంచరీలు సాధించినా.. నిలకడలేమితో ఆకట్టుకును ప్రదర్శనను చేయలేకపోతుంది. ఇక టి20 ప్రపంచకప్‌లో వేలి గాయంతో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమైంది. అనంతరం విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడినా 10 పరుగులే చేసింది. అయితే లేడీ ధోని రిచా ఘోష్ సూపర్ ఫామ్‌లో ఉండటం.. జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌లు రాణిస్తుండటం భారత్‌కు సానుకూలమని విషయం. ఇక బౌలింగ్‌లో దీప్త శర్మ క్రమం తప్పకుండా వికెట్లు తీస్తుంది. రేణుక సింగ్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్‌లతో భారత బౌలింగ్ బలంగా కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News