Saturday, January 18, 2025

న్యూజిలాండ్‌ పై ఇంగ్లండ్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

చెస్టర్ లీ స్ట్రీట్: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టి20లో ఆతిథ్య ఇంగ్లండ్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిన్ అలెన్ (21), గ్లెన్ ఫిలిప్స్ (41), ఐష్ సోధి (16) మాత్రమే కాస్త రాణించారు. మిగతావారు విఫం కావడంతో కివీస్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో లుక్‌వుడ్, బ్రైడన్ కార్సె మూడేసి వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 14 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.

ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో (4), విల్ జాక్స్ (22) ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. అయితే డేవిడ్ మలన్, హారి బ్రూక్‌లు అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన మలన్ ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. మరోవైపు ధాటిగా ఆడిన హారి బ్రూక్ 3 సిక్సర్లు, రెండు ఫోర్లతో 27 బంతుల్లోనే అజేయంగా 43 పరుగులు చేశాడు. లియామ్ లివింగ్‌స్టోన్ 10 (నాటౌట్) తనవంతు పాత్ర పోషించడంతో ఇంగ్లండ్ మరో ఆరు ఓవర్లు మిగిలివుండగానే విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News