Sunday, January 19, 2025

పాకిస్థాన్‌ పై ఇంగ్లండ్ విజయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ మూడో విజయం సాధించింది. శనివారం ఈడెన్ గార్డెన్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 93 పరుగుల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ టోర్నీలో ఇంగ్లండ్‌కు ఇది మూడో విజయం. కాగా, ఈ ఓటమితో పాకిస్థాన్ సెమీస్‌కు చేరకుండానే ఇంటిదారి పట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 337 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 43.3 ఓవర్లలో 244 పరుగులకే కుప్పకూలింది. కాగా, మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన

ఇంగ్లండ్‌కు ఓపెనర్లు మలన్ (31), బెయిర్‌స్టో (59) శుభారంభం అందించారు. జోరూట్ (60), స్టోక్స్ (84) పరుగులతో అలరించారు. కెప్టెన్ బట్లర్ 27, హారి బ్రూక్ 30 పరుగులు సాధించారు. దీంతో ఇంగ్లండ్ భారీ స్కోరును సాధించింది. ఇక సెమీ ఫైనల్ చేరాలంటే పాకిస్థాన్ 6.4 ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని ఛేదించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే దీనిలో పాక్ విఫలమైంది. ఓపెనర్లు అబ్దుల్లా షఫిక్ (0), ఫకర్ జమాన్ (1) విఫలమయ్యారు. ఆ తర్వాత పాకిస్థాన్ మళ్లీ కోలుకోలేక పోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News