Monday, December 23, 2024

ఫైనల్లో ఇంగ్లండ్

- Advertisement -
- Advertisement -

ఉత్కంఠ సెమీస్‌లో నెదర్లాండ్స్‌పై విజయం
తుది పోరులో స్పెయిన్‌తో ఢీ
యూరోకప్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్

డార్ట్‌మండ్(జర్మనీ): ప్రతిష్ఠాత్మకమైన యూరో కప్ 2024 ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఇంగ్లండ్ టీమ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఉత్కంఠభరితంగా సాగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ 21 గోల్స్ తేడాతో బలమైన నెదర్లాండ్స్ జట్టును ఓడించింది. ఫైనల్లో స్పెయిన్‌తో ఇంగ్లండ్ తలపడుతుంది. మూడో స్థానం కోసం జరిగే పోరులో ఫ్రాన్‌నెదర్లాండ్స్ జట్లు తలపడుతాయి. ఇక ఇంగ్లండ్‌డచ్ జట్ల మధ్య జరిగిన పోరు ఆరంభం నుంచే నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇరు జట్లు ఎటాకింగ్ గేమ్‌తో ముందుకు సాగాయి. ఆరంభంలో నెదర్లాండ్స్ ఆధిపత్యం చెలాయించింది. ఏడో నిమిషంలోనే జేవి సిమన్స్ డచ్ టీమ్‌కు తొలి గోల్ సాధించి పెట్టాడు. దీంతో నెదర్లాండ్స్ ఆట ప్రారంభంలోనే ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

అయితే ఇంగ్లండ్ కూడా స్కోరును సమం చేసేందుకు తీవ్రంగా శ్రమించింది. నెదర్లాండ్స్ గోల్ పోస్ట్ వైపు వరుస దాడులతో హోరెత్తించింది. నెదర్లాండ్స్ పటిష్టమైన డిఫెన్స్ దాటుకుంటూ లక్షం దిశగా సాగింది. 18వ నిమిషంలో ఇంగ్లండ్ శ్రమ ఫలించింది. హరికేన్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంలో సఫలమయ్యాడు. దీంతో ఇంగ్లండ్ స్కోరును 11తో సమం చేసింది. తర్వా త కూడా ఇటు ఇంగ్లండ్ అటు నెదర్లాండ్స్ గోల్ కోసం తీవ్రంగా శ్రమించాయి. కానీ ప్రథమార్ధంలో రెండు జట్లు కూడా మరో గోల్ సాధించలేక పో యాయి. ద్వితీయార్ధంలో కూడా పోరు ఆసక్తికరంగానే సాగింది. నెదర్లాండ్స్, ఇంగ్లండ్ దూకుడైన ఆటను కనబరిచాయి. కానీ బలమైన డిఫెన్స్‌తో చాలా సేపటి వరకు గోల్స్ లభించలేదు.

కానీ ఆట 90 నిమిషంలో నిరీక్షణకు తెరదించుతూ ఇంగ్లండ్ ఆటగాడు ఓలి వాట్స్‌కిన్ గోల్ సాధించాడు. ఈ గోల్‌తో ఇంగ్లండ్ 21 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరి వరకు దీన్ని కాపాడుకున్న ఇంగ్లండ్ మ్యాచ్ ను సొంతం చేసుకుని ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుం ది. నెదర్లాండ్స్ ఈ మ్యాచ్‌లో అసాధారణ ఆటను కనబరిచినా ఫలితం లేకుండా పోయింది. చివరి వరకు నిలకడైన ఆటను కనబరచడంలో సఫలమైన ఇంగ్లండ్ తుది పోరుకు దూసుకెళ్లింది. ఈ టోర్నమెంట్‌లో ఇంగ్లండ్, స్పెయిన్‌లు అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఫైనల్‌కు చేరుకున్నాయి. టైటిల్స్ ఫేవరెట్లుగా భావించిన జర్మనీ, ఫ్రాన్స్, బెల్జియం తదితర జట్లు మధ్యలోనే ఇంటిదారి పట్టాయి. ఇంగ్లండ్, స్పెయిన్‌లు మాత్రం అద్భుత ఆటతో టైటిల్ పోరుకు అర్హత సాధించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News