Thursday, January 23, 2025

అండర్-19 ప్రపంచకప్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌

- Advertisement -
- Advertisement -

England won the toss and elected to bat

 

అంటిగువా: అండర్19 ప్రపంచకప్ తుది పోరుకు భారత యువ జట్టు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. మరికాసేపట్లో ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్‌ బ్యాటింగ్ ఎంచుకుంది. అంటిగ్వాలోని సర్ విలియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్లో ఘన విజయం సాధించి భారత యువ జట్టు సమరోత్సాహంతో ఫైనల్ బరిలోకి దిగుతోంది.  ఇప్పటికే నాలుగు సార్లు అండర్19 ప్రపంచకప్ ట్రోఫీని గెలిచిన భారత్ మరో టైటిల్‌పై కన్నేసింది. ఇక ఇంగ్లండ్ సుదీర్ఘ విరామం తర్వాత ఫైనల్‌కు చేరుకుంది. ఇంగ్లండ్‌తో పోల్చితే భారత్ అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తోంది. సమష్టి పోరాటంతో భారత్ ముందుకు సాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News