Monday, January 20, 2025

సర్కార్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం

- Advertisement -
- Advertisement -

English medium in Government schools from next academic year

వచ్చే విద్యా సంవత్సరం
నుంచి అమలు

ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో
ఫీజుల నియంత్రణ వచ్చే
అసెంబ్లీ సమావేశాల్లో చట్టం
విద్యాశాఖ మంత్రి సబిత
నేతృత్వంలో కేబినెట్ సబ్
కమిటీ మన ఊరు-మన
బడి కార్యక్రమానికి
కేబినెట్ ఆమోదం

స్కూళ్లలో నాణ్యమైన బోధన, మౌలిక
వసతుల కల్పనకు రూ.7289 కోట్లు

మహిళా, అటవీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం

సిద్దిపేట జిల్లాలోని ఎఫ్‌సిఆర్‌ఐలో చదివిన విద్యార్థులకు ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు

మన తెలంగాణ/హైదరాబాద్ : పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ. 7289 కోట్లతో ‘మన ఊరు… మన బడి’ కార్యక్ర మానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలే జీల్లో ఫీజుల నియంత్రణతో పాటు వచ్చే విద్యాసం వత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీ డియంలో విద్యా బోధనకై కొత్త చట్టాన్ని తీసుకు రావాలని కేబినెట్ నిర్ణయించింది. రానున్న శాసనసభా సమావేశాల్లో దీనికి సంబంధించిన నూత న చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. రా ష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయా లని తలపెట్టింది. ఈ రెండు అంశాలపై పూర్తి అ ధ్యయనం చేసి సంబంధిత విధి విధానాలను రూ పొందించేందుకు ఒక సబ్ కమిటీని రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేసింది. ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం రెండున్నర గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై కూలంకషంగా చర్చించింది. అనేక కీలక నిర్ణయా లు తీసుకుంది. ఇందులో భాగంగా విద్యాశాఖపై కూడా లోతుగా చర్చించింది. ప్రైవేటు విద్యాసం స్థల్లో ఇష్టానుసారంగా (భారీగా) ఫీజులు వసూలు చేస్తున్నారన్నన్న ఆరోపణలు పెద్దఎత్తున వినిపిస్తు న్నాయి. అలాగే నేటి ఏర్పాటు చేసింది.

ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం రెండున్నర గంటలకు సిఎం కెసిఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై కూలంకషంగా చర్చించింది. అనేక కీలక నిర్ణయా లు తీసుకుంది. ఇందులో భాగంగా విద్యాశాఖపై కూడా లోతుగా చర్చించింది. ప్రైవేటు విద్యాసం స్థల్లో ఇష్టానుసారంగా (భారీగా) ఫీజులు వసూలు చేస్తున్నారన్నన్న ఆరోపణలు పెద్దఎత్తున వినిపిస్తు న్నాయి. అలాగే నేటి ఆధునిక సామాజిక పరిస్థితులకు అణుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం లో బోధన చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రులు కొప్పుల ఈశ్వ ర్, తలసాని శ్రీనివాసయాదవ్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కెటిఆర్‌లు ఈ సబ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

మన ఊరు.. మన బడి కార్యక్రమాలు ఇవీ..

రాష్ట్రంలోని 26,065 ప్రభుత్వ, స్థానిక సంస్థ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 19,84,167 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య, నమోదు, హాజరు, కొనసాగింపుతో పాటు దశలవారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు మౌలిక వసతుల ఏర్పాటు కోసం ప్రభుత్వం ‘మన ఊరు – మన బడి’ ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. రెండేండ్ల వ్యవధిలో రూ.4 వేల కోట్లతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పనతో నాణ్యమైన విద్యను అందించే దిశగా రాష్ట్రంలోని పాఠశాలల సమగ్రాభివృద్ధి కోసం కార్యక్రమాలు చేపడుతారు. ఇందులో భాగంగా సాంకేతికత విజ్ఞాన ఆధారిత విద్యను అందించడం కోసం డిజిటల్ క్లాస్ రూంల ఏర్పాటు, వాటితో పాటు అదనపు తరగతి గదులు ఏర్పాటు, మరమ్మత్తులు, అవసరమైన మేరకు ఫర్నిచర్, మరుగుదొడ్లు మరియు ఇతర వసతుల కల్పన ఈ ప్రణాళిక ఉద్దేశ్యం.

కాగా, ఈ కార్యక్రమ అమలు, విధివిధానాల రూపకల్పన కోసం మంత్రుల బృందం ఇప్పటికే గత సంవత్సరం మార్చి 23, ఏప్రిల్ ..8, జూన్..171 తేదీలలో మంత్రులు పి.సబితా ఇంద్రారెడ్డి, కెటిఆర్, హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావులతో కూడిన మంత్రుల బృందం సమావేశమైంది. ‘మన ఊరు – మన బడి’ అమలు కోసం మంత్రుల బృందం పలు అంశాలను పొందుపరిచి విధివిధానాలను రూపొందించింది.

విధి విధానాల్లోని ముఖ్యాంశాలు…

1. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాంగా చేపట్టి మూడు దశల్లో మూడు సంవత్సరాల వ్యవధిలో విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచడం.

2. 2021…20 22 విద్యాసంవత్సరం మొదటి దశలో, మండలం కేంద్రాన్ని యూనిట్ గా తీసుకొని అన్ని రకాల (ప్రాథమిక పాఠశాల, మాద్యమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాలల్లో) అత్యధికంగా ఎన్‌రోల్‌మెంట్ అయిన 9,123 (35 శాతం స్కూళ్లలో 65 శాతం విద్యార్థులను) ప్రభుత్వ, స్థానిక సంస్థలకు చెందిన పాఠశాలల్లో ముందుగా కార్యక్రమం అమలు చేయాలి.

3. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం క్రింద 12 రకాల విభాగాలను పటిష్టపరిచేందుకు ప్రతిపాదించడం జరిగింది. ఇందులో
నీటి సౌకర్యంతో కూడిన టాయిలెట్లు , విద్యుదీకరణ, త్రాగు నీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బందికి సరిపడ ఫర్నిచర్, పాఠశాల మొత్తం పెయింటింగ్ వేయడం, పెద్ద, చిన్న మరమ్మత్తులు, గ్రీన్ చాక్ బోర్డులు, ప్రహారీ గోడలు, కిచెన్ షెడ్లు , శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్ రూంలు,) ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాల్స్,) డిజిటల్ విద్య అమలు చేయాలని ప్రతిపాదించారు.

4. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో పేర్కొన్న 12 విభాగాల అనుబంధ అంచనాల ఆధారంగా మొత్తం బడ్జెట్ రూ.7,289.54 కోట్లు అవసరమవుతాయి. ఇందులో భాగంగా మొదటి దశలో 9,123 పాఠశాలలకు (35శాతం) అంచనా బడ్జెట్ రూ.3,497.62 కోట్లుగా ఉంది.

5. ఎంపిక చేయబడిన ప్రతి పాఠశాలలో చేపట్టే కార్యక్రమ అమలు కోసం అన్ని పనులకు పరిపాలనా అనుమతిని జిల్లా కలెక్టర్లు ఇస్తారు. ‘ఒక మండలంలో కార్యక్రమాన్ని అమలుచేసే ఏజెన్సీ ఒకటే ఉండే విధంగా అందుబాటులో ఉన్న ఏజెన్సీల నుంచి తమ జిల్లాలో అమలు చేసే ఏజెన్సీని ఎంచుకోవచ్చు. అలాగే అమలు చేసే ఏజెన్సీ విభాగాల వారీగా సాంకేతిక అనుమతిని ఇస్తుంది.

6. ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకంగా,అన్ని పనులను వేగంగా అమలు చేయడం కోసం ‘పాఠశాల నిర్వహణ కమిటీ’ (ఎస్‌ఎమ్‌సి)లకు బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది.

7. నిధుల సమీకరణ కోసం ఆర్థిక శాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఇందుకు సంబంధించిన సాంకేతిక అంశాలను రాష్ట్ర ఐటి డిపార్ట్ మెంట్ పర్యవేక్షిస్తుంది.

8. ‘పాఠశాల నిర్వహణ కమిటీ’లకు దశల వారీగా పారదర్శక పద్ధతిలో నిధులను విడుదల చేస్తారు.

9. గ్రామీణాభివృద్ధి శాఖ కింద పనిచేస్తున్న “సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్సపరెన్సీ” (ఎస్‌ఎఎటి) అనే సంస్థ చేత సామాజిక తనిఖీ నిర్వహిస్తారు.

10.ప్రతి స్కూల్ లో పూర్వ విద్యార్థుల సంఘాలను ఏర్పాటు చేసి..ఇందులోని ఇద్దరు క్రియాశీలక సభ్యులను, సర్పంచ్, ఇద్దరు పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. దాతలు, సిఎస్‌ఆర్ నిధులు తదితర మార్గాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి

11. ఆర్థికాంశాలు,కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి నిర్ధిష్ట కాలపరిమితితో కూడిన అంశాలవారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను తయారుచేసుకోవాలి.

ఎఫ్‌సిఆర్‌ఐ విద్యార్థులకు కోటా

సిద్ధిపేట జిల్లా ములుగులోని ‘ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్’ (ఎఫ్‌సిఆర్‌ఐ)లో విద్యనభ్యసించిన అర్హులైన విద్యార్థులకు ఫారెస్ట్ డిపార్టుమెంట్ ఉద్యోగాల భర్తీలో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కోటా కింద పలు విభాగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. బిస్‌సి ఫారెస్ట్రీ (హానర్స్) నాలుగేండ్ల డిగ్రీ కోర్సు ద్వారా అత్యున్నత ప్రమాణాలతో కూడిన క్వాలిఫైడ్ ఫారెస్ట్రీ గ్రాడ్యుయేట్స్‌ను ప్రభుత్వం అందిస్తున్న నేపథ్యంలో రాష్ట్రం కేబినేట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ‘అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్’ (ఎసిఎఫ్) విభాగంలోని ఉద్యోగాల్లో 25 శాతం రిజర్వేషన్లు, ‘ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్’ (ఎఫ్‌ఆర్‌ఒ) విభాగానికి చెందిన ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు, “ఫారెస్టర్స్‌” విభాగానికి చెందిన ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేబినేట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఫారెస్ట్ సర్వీస్ రూల్స్ (1997), రాష్ట్ర స్టేట్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ (2000) లలో సవరణలు చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయి ంచింది. రాష్ట్రంలో‘ఫారెస్ట్ యూనివర్సిటీ’ ఏర్పాటుకు కేబినేట్ అంగీకరి ంచింది. అటవీశాఖ అధికారులు ఈ దిశగా ప్రాథమిక సమాచారంతో కూడిన నివేదికను కేబినేట్ కు అందించగా, వచ్చే కేబినేట్ సమావేశం నాటికి పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసుకొని రావాలని అటవీశాఖ అధికారులను కేబినేట్ ఆదేశించింది.

మహిళా యూనివర్శిటీ ఏర్పాటుకు ఆమోదం

రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు కోసం విద్యాశాఖ మంత్రి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తదుపరి కేబినెట్ సమావేశానికి పూర్తిస్థాయిలో ప్రతిపాదనలను సిద్దం చేసుకుని రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మంత్రివర్గ సమావేశం ఆదేశించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News