Friday, December 27, 2024

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగర ప్రజలకు, పర్యాటకులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందిస్తూ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుతున్న ట్యాంక్‌బండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడటం మనందరి బాధ్యత అని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ సూచించారు. మనం నివసించే ఇంటిలాగానే మనకు గర్వకారణం అయిన పర్యాటక ప్రదేశాల్లో కూడా పరిశుభ్రతను పాటించాలని పర్యాటకులకు మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్‌లో విజ్ఞప్తి చేశారు. మహానగరానికి మణిహారం ట్యాంక్‌బండ్ అని, శతాబ్దాల ఘన చరిత్రకు ప్రతీక ట్యాంక్‌బండ్ అని ఆయన పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగానే ట్యాంక్‌బండ్ సుందరీకరణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఈ విశిష్ట నిర్మాణానికి మరిన్ని మెరుగులు అద్ది ట్యాంక్‌బండ్‌ను అత్యంత అందంగా తీర్చిదిద్దిందని మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

ట్విట్టర్‌లో వీడియోను విడుదల చేసిన మంత్రి
ట్యాంక్‌బండ్ మహానగరానికి మణిహారంగా మారుతోంది. దీనిని ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దుతోంది. ఈ నేపథ్యంలోనే సాయంత్రం వేళ, సెలవుదినాల్లో ట్యాంక్‌బండ్‌కు పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే ట్యాంక్‌బండ్‌ను పర్యాటకులు అపరిశుభ్రంగా తయారు చేస్తున్నారు. రాత్రి వేళల్లో తినుబండారాలకు సంబంధిన పదార్థాలను, కేకులను ఇతర వ్యర్థాలను ట్యాంక్‌బండ్‌పై పడేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా అపరిశుభ్రంగా మారడమే కాకుండా, మార్నింగ్ వేళ వచ్చే ప్రకృతి ప్రేమికులకు, వాకర్స్‌కు ఇబ్బందిని కలిగిస్తోంది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో రాష్ట్ర పట్టణాభివృద్ధి, మున్సిపాలిటీ శాఖల మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను విడుదల చేస్తూ సందేశమిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News