- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షకుడు, జంతు ప్రేమికుడైన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ వీకెండ్‌లో వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ ప్రకృతితో మమేకమయ్యే విభిన్న పక్షుల విన్యాసాలను తన కెమెరాలో నిక్షిప్తం చేస్తారు. ప్రకృతి పరిరక్షణ, జంతు సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఆయా ప్రాంతాలలో ముచ్చటగొలిపే అరుదైన పక్షుల చిత్రాలను తన కెమెరాలో బంధిస్తూ వాటిని తన ట్వీట్‌కు జత చేస్తారు.
‘ఎంజాయ్ హ్యాపిసండే’ పేరిట వీకెండ్‌లో ఆహ్లాదపర్చే విధంగా ఆయన తీసే చిత్రాలు పర్యావరణ, జంతు ప్రేమికులను అలరిస్తాయి. దీంతో ఈ చిత్రాలపై ప్రతి ఒక్కరి దృష్టి నిలపడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, జంతు సంరక్షణ తదితరాంశాలపై అవగాహనను మరింతగా ఇనుమడింపజేస్తున్నాయి.
- Advertisement -