Saturday, January 11, 2025

ప్రకృతి అందాలను ఆస్వాదిస్తారు.. పక్షుల విన్యాసాలను కళ్లకు కడతారు…

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణ, ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతిలో భాగమైన పక్షుల విన్యాసాలను తన కెమెరాలో నిక్షిప్తం చేస్తూంటారు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్. పర్యావరణంతో పాటు ప్రకృతి అందాల ఆయన వీకెండ్‌లో ఆస్వాదిస్తుంటారు. ప్రతి వీకెండ్‌లో ఆయన వివిధ ప్రాంతాలను సందర్శిస్తుంటారు. పర్యావరణ పరిరక్షణ పట్ల ఆయన ఎంత మక్కువ చూపిస్తారో.. ప్రకృతిపైనే ఆయన అంతే ఆసక్తిని కనబరుస్తుంటారు. ఈ సందర్భంలో ప్రకృతితో ముడిపడిన ఎన్నో అంశాలను ఆయన స్పృజిస్తూ ఉంటారు. అదే సమయంలో ప్రకృతి అందాలను ఆయన ఒడిసిపట్టుకుంటారు. తన కెమరాతో ఆ అరుదైన దృశ్యాలను బంధిస్తూంటారాయన. ఓ వైపు పర్యావరణ పరిరక్షణలో బిజీగా ఉంటూనే మరోవైపు ప్రకృతి పట్ల తన ఆరాధనా భావాన్ని వీకెండ్‌లో ఆయన కనబరుస్తూంటారు.

అరుదైన ప్రకృతి అందాలను, అరుదైన పక్షి జాతుల చిత్రాలను తన కెమెరాలో క్లిక్‌మన్పిస్తారు. ఆయన చిత్రాలను తన ట్విట్టర్‌లో పోస్తు చేసి తన అభిమానులకు పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి పట్ల ఆరాధన భావాన్ని మరింత పెంపొందించేలా తన వంతు ప్రయతాన్ని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ చేస్తుంటారు. ఆయన తీసిన అరుదైన చిత్రాలు ఆయన అభిమానులతో పాటు సామాన్యులను సైతం మంత్రముగ్ధుల్ని చేస్తాయి.. అంతేకాదు ఆలోచింపజేస్తాయనడంలో సందేహం లేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News