Wednesday, January 15, 2025

సక్సెస్‌ను ఆస్వాదించండి… బాధ్యతను మరవొద్దు

- Advertisement -
- Advertisement -

ఆర్మి డెంట్ కాలేజీ విద్యార్థులకు సిఎం ఉద్బోధ

మన తెలంగాణ / హైదరాబాద్ : మీరు మీ సక్సెస్ ను ఆస్వాదించండి, కాని ఎప్పుడూ మీ బాధ్యతను మరిచిపోవద్దు. అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్మీ డెంటల్ కాలేజి విద్యార్థులకు సూచించారు. మంగళవారం జరిగిన సికింద్రాబాద్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ స్నాతకోత్సవ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ మీ కళాశాల స్నాతకోత్సవానికి హాజరు కావడం సంతోషంగా ఉందని అన్నారు. ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌లోని ప్రతి విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు. మీ కృషి, అంకితభావం మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాయని, ఈ రోజు నుంచి మీరు కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారని, మీరు చేసే పనులు మీకు, మీకుటుంబానికే కాదు మీ కాలేజ్ కు గుర్తింపును తీసుకొస్తాయని సిఎం అన్నారు. ఎసిడిఎస్ మన సైనికుల పిల్లలకు సేవలందించడం మన సైన్యానికి, దేశానికి గర్వకారణమని అన్నారు. అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News