Wednesday, January 22, 2025

సర్కారీ దవాఖానాలకు నాణ్యత సర్టిఫికెట్లు

- Advertisement -
- Advertisement -

మరో 13 ఆస్పత్రులకు ఎన్‌క్వాష్ ధ్రువపత్రాలు

రాష్ట్రంలో ఈ గుర్తింపు పొందిన ప్రభుత్వాస్పత్రుల సంఖ్య 143కు చేరిక ‘లక్షం’ సాధించిన నిర్మల్ ఏరియా
ఆస్పత్రి మన వైద్య, ఆరోగ్య రంగం దేశానికే ఆదర్శం : వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/హైదరాబాద్ : రా ష్ట్రంలోని మరో 13 ప్రభుత్వ ఆసుపత్రు లు ఎన్‌క్వాష్ (నేషనల్ క్వాలిటీ అష్యురెన్స్ స్టాండ్రడ్స్ ఎన్‌క్యూఎఎస్)- సర్టిఫికెట్లు సాధించగా, మరో మూడు ఆస్పత్రులకు రీ సర్టిఫికేషన్ వచ్చింది. లేబర్ రూమ్, ఆపరేషన్ ధియేటర్ నిర్వహణలో అత్యున్నత నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నందుకు నిర్మల్ ఏరియా ఆ సుపత్రి ‘లక్ష్య‘ గుర్తింపు లభించింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు జాతీయ స్థాయి గుర్తింపు రావడం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ హర్షం వ్యక్తం చేశారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో ప్రభుత్వ వైద్య సేవల్లో నాణ్యత ప్రమాణాలు గణనీయంగా పెరిగాయని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ జాతీయ స్థాయి గుర్తింపే నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో పిహెచ్‌సి స్థాయి నుంచి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్ర వైద్యారోగ్య రంగం దేశానికే ఆదర్శంగా మారుతున్నదని అన్నారు.

కార్పొరేట్ ఆసుపత్రులకే పరిమితమైన జాతీయ స్థాయి నాణ్యత ప్రమాణాల గుర్తింపును తెలంగాణలోని జిల్లా, ప్రాంతీయ, సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సాధించడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేస్తున్న వైద్యారోగ్య సిబ్బందిని అభినందించారు. తాజాగా గుర్తింపు లభించిన ఆసుపత్రులతో కలిపి రాష్ట్రంలో మొత్తం 143 ఆసుపత్రులకు ఎన్‌క్వాష్ గుర్తింపు వచ్చిందని చెప్పారు. ఈ గుర్తింపు కలిగిన ఆసుపత్రులు అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు. అన్ని సర్కారు ఆసుపత్రులకు ఈ గుర్తింపు కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదనీ, ఆ దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. దేశంలో మొదటి స్థానంలో నిలవడం లక్ష్యంగా పని చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వం వైద్యారోగ్య రంగాన్ని పటిష్టం చేస్తున్నదని అన్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు పెరిగాయని, విలువైన వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఒపి, ఐపి, సర్జికల్…ఇలా అన్ని విభాగాల్లో నాణ్యత పెరిగిందని, దీంతో రాష్ట్ర ప్రజలకు ఉచితంగా, నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News