- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రులకు జాతీయస్థాయి గుర్తింపు రావడం సంతోషకరమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. కెసిఆర్ నాయకత్వంలో వైద్య సేవల్లో నాణ్యతా ప్రమాణాలు పెరిగాయని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర వైద్యారోగ్య రంగం దేశానికే ఆదర్శంగా మారుతోందని హరీశ్ రావు తెలిపారు. మొత్తం 143 ఆసుపత్రులకు ఎన్ క్వాష్ గుర్తింపు వచ్చిందన్నారు. గుర్తింపు కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగోస్థానంలో నిలిచిందని ఆయన వెల్లడించారు.
- Advertisement -