Saturday, November 23, 2024

దా‘రుణ’యాప్ కేసులో దర్యాప్తు ముమ్మరం

- Advertisement -
- Advertisement -

enquiry on Loan apps in hyderabad

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రుణ యాప్‌ల కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు ఇప్పటికే 17మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో కీలక నిందితుడు చైనాకు చెందిన లాంబోను కస్టడీలోకి తీసుకొని వివరాలు సేకరించారు.డిజిటల్ సూక్ష్మ రుణ సంస్థల కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు.

ఆన్‌లైన్ రుణ యాప్‌ల కేసులలో ఇప్పటికే 17మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకొని వివరాలు సేకరిస్తున్నారు. లాంబో అనే చైనా వ్యక్తి రుణ యాప్‌లను రూపొందించడంతో పాటు వాటి ద్వారా రుణాలు ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈనేపథ్యంలో లాంబోను ప్రత్యేకంగా కస్టడీలోకి తీసుకొని కొంత సమాచారం సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు. లాంబో సెల్‌ఫోన్, లాప్‌టాప్, ఐ పాడ్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని విశ్లేషిస్తున్నారు. లాంబో పంపిన సందేశాలు, అతనికి వచ్చిన సందేశాలన్నీ చైనా భాషలోనే ఉండడం వల్ల ఆ భాష తెలిసిన వాళ్ల సాయంతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

లాంబో తన లాప్‌టాప్ నుంచి కీలక సమాచారం తొలగించినట్లుగా గుర్తించిన పోలీసులు కంప్యూటర్ నిపుణుల సాయంతో లాప్‌టాప్‌లోని మొత్తం సమాచారం పరిశీలిస్తున్నారు.ఈక్రమంలో బెంగళూర్‌లో కాల్ సెంటర్లు నిర్వహిస్తున్న మరో నలుగురిని సైబర్ క్రైం పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.ఇదిలావుండగా రాజేంద్రనగర్, జగిత్యాలలో చనిపోయిన ఇద్దరు వ్యక్తులు ఈ రుణ యాప్‌ల నుంచి అప్పు తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బెంగళూర్ కాల్ సెంటర్ నిర్వాహకులపై రెండు కేసులను సైబర్ క్రైం పోలీసులు నమోదు చేశారు. ఒక కేసులో కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించిన పోలీసులు మరో కేసులో పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకొని, న్యాయస్థానంలో ప్రవేశపెట్టి కస్టడీ కోరే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News