Monday, December 23, 2024

గోల్ స్టోన్స్ సంస్థపై విచారణ జరపాలి

- Advertisement -
- Advertisement -
బీఎస్పీ అధ్యక్షుడు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ డిమాండ్

హైదరాబాద్: గోల్ స్టోన్స్ సంస్థ అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం శంషాబాద్ మండలం ఘాన్సిమియాగూడలో ఆసంస్థ బోగస్ రెవిన్యూ రికార్డులతో ఆక్రమించుకున్న రైతుల పట్టా భూములను సోమవారం ఆయన పరిశీలించారు.

ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ సర్వే నంబర్లు 3, 4 లో తరతరాలుగా రైతులు సాగుచేసుకుంటున్న భూములను రైతుల నుండి నేరుగా కొనుగోలు చేసినట్లు నకిలీ పత్రాలను సృష్టించి ఆక్రమించుకున్నారని అన్నారు. సుమారు 100 మంది రైతులకు చెందిన 200 ఎకరాల భూమిని ఆక్రమించుకొని రైతులను బెదిరింపులకు గురించేస్తున్నారని పేర్కొన్నారు.

భూదందా అక్రమాలపై చర్యలు తీసుకోవాలని రైతులు జిల్లా రెవెన్యూ,పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా,ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. గోల్ స్టోన్స్ సంస్థ రైతులను భయపెట్టి,బలవంతంగా ఆక్రమించుకున్న భూములపై సమగ్ర విచారణ జరపాలన్నారు. ప్రభుత్వ,అసైన్డ్ మెంట్ భూములతోపాటు రైతులకు తెలియకుండా ప్రయివేటు భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూ కబ్జాదారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News