Friday, December 20, 2024

బోనగిరి బిఆర్‌ఎస్‌లో చేరికల జోరు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి : భువనగిరి నియోజకవర్గంలోని బిఆర్‌ఎస్‌లోకి చేరికల జోరు కొనసాగుతున్నది. వివిధ పార్టీల నాయకులు రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా గులాబీ కండువా కప్పుకుంటున్నారు. తాజాగా భువనగిరి మండలంలోని బస్వాపురం , బిఎన్ తిమ్మాపురం గ్రామానికి చెందిన 200 మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు శనివారం బీఆర్‌ఎస్ పార్టీ భువనగిరి ఎమ్మెల్యే పై ళ్ల శేఖర్ రెడ్డి సమక్షంలో పా ర్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరినవారికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి చేరుతున్నాయన్నారు. దీంతో వివిధ పార్టీల నాయకు లు, ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారన్నారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో మౌలిక సదుపాయాలు లేక ఎంతో ఇబ్బందులు పడేవారని ఇప్పుడు ప్రతి గ్రా మంలో మౌలిక వసతులు, సౌకర్యాలు పెద్ద ఎత్తున కల్పించామన్నారు. అన్ని వర్గాల ప్రజలు బిఆర్‌ఎస్ వైపు చూస్తున్నారని, రెట్టింపు మెజార్టీతో గులాబీ జెండా భువనగిరి గడ్డపై మరోమారు ఎగరబోతున్నదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈకార్యక్రమంలో భువనగిరి మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు , మదర్ డైరీ డైరెక్టర్ కస్తూరి పాండు, మాజీ పాల సంఘం అధ్యక్షులు జిన్నా నరసింహా, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొలుపుల అమరేందర్ గారు గ్రంధాలయ చైర్మన్ జిల్లా అమరేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్ రెడ్డి,నరాల వెంకటస్వామి, పిన్నం సీతయ్య, పిన్నెం గణేష, జిన్న రమేష్ , కుచ్చుల స్వామి, పిన్నెం కనకరాజు, దంతూరి నరసింహ, పాముల బిక్షపతి, అన్నెపు ఎల్లయ్య, అన్నెపు నందు, బోనాల బాలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News