Sunday, February 23, 2025

హనుమాన్ జయంతి సందర్భంగా కేంద్రం మార్గదర్శకాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గురువారం జరుపుకోనున్న హనుమాన్ జయంతిని వేడుకలపై కేంద్రం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అలర్ట్ అయింది. రేపు జరుగనున్న హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. గత వారం రామనవమి సందర్భంగా బీహార్, పశ్చిమ బెంగాల్‌తో సహా రాష్ట్రాలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. శాంతిభద్రతలను పరిరక్షిస్తూ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని ఆదేశించింది. సమాజంలో మత సామరస్యాన్ని భంగం కలిగించే ముప్పును నిరంతరంగా పర్యవేక్షించాలని రాష్ట్రాలకు సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News