Saturday, November 9, 2024

హెల్త్ కార్డులతో ఉద్యోగులకు ఆరోగ్య భరోసా

- Advertisement -
- Advertisement -

Ensuring health with health cards

జలమండలి పర్సనల్ డైరక్టర్ శ్రీధర్‌బాబు

హైదరాబాద్ : జలమండలి ఉద్యోగులకు ప్రభుత్వం అందించిన హెల్త్ కార్డులతో ఆరోగ్య భరోసా లభిస్తుందని జలమండలి పర్సనల్ డైరక్టర్ శ్రీధర్ బాబు అన్నారు. ప్రభుత్వం అందించిన హెల్త్‌కార్డులను వినియోగించుకునే విధానం, హెల్త్ కార్డుల ద్వారా కలిగే ప్రయోజనాలను శుక్రవారం ఎస్‌ఆర్‌నగర్‌లోని జలమండలి డివిజన్ 6 కార్యాలయంలో అవగాహన కార్యక్రమలో తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పలు వైద్యపరీక్షలు నిర్వహించుకున్నారు. సెకండ్ డోస్ వ్యాక్నిన్ తీసుకోని వారు తమ సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి సీజీఎంలు, ఎంఏ ఖాదర్ , ప్రభు, జీఎం హరిశంకర్, జలమండలి ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

నేడు ఖైరతాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయంలో..

ఉచిత ఆరోగ్య శిభిరాన్ని శనివారం నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని ఉద్యోగులు, సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News