Wednesday, January 22, 2025

పేదల ఆరోగ్యానికి భరోసా… సిఎం సహాయ నిధి

- Advertisement -
- Advertisement -
  • చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే సతీష్ కుమార్

హుస్నాబాద్: హుస్నాబాద్ మండల పరిదిలోని పలు గ్రామాలకు సంబంధించి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన నలుగురు లబ్ధిదారులకు 1 లక్ష 52 వేల రూపాయల విలువ గల చెక్కులను సోమవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ఆపదలో ఉన్న కుటుంబాలకు సిఎం రిలీఫ్ పండ్ అపన్నహస్తంలా ఉపయోగపడుతుందన్నారు. నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటుదని వ్యాధి భారిన పడి చికిత్సకు నోచుకోలేని నిరుపేదల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సిఎం సహాయనిధి ద్వారా అండగా నిలుస్తుందన్నారు. సిఎం రిలీఫ్ పండ్ పేదప్రజల ఆరోగ్యానికి భరోసాగా ఉంటున్నదని ఎంతో మంది పేద ప్రజలు ఈ సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధిపొందుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి లకావత్ మానస, మండల బిఆర్‌ఎస్ అధ్యక్షుడు వంగ వెంకట్రామిరెడ్డి, మాజీ ఎఎంసి చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, యూత్ విభాగాల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News