Friday, November 22, 2024

ఇంటి నిర్మాణ వివరాలు టిఎస్ బిపాస్‌లో నమోదు చేసుకోండి

- Advertisement -
- Advertisement -

Enter construction details of house in TS B pass

లేకపోతే భారీగా జరిమానా విధిస్తాం
గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లుగా
రూపాంతరం చెందిన గ్రామాలకు పురపాలక శాఖ ఆదేశం
అక్రమ కట్టడాలు చేపట్టిన ఇళ్ల నిర్మాణాల
వివరాలను సేకరిస్తున్న పురపాలక శాఖ అధికారులు

మనతెలంగాణ/హైదరాబాద్ : గ్రామ పంచాయతీల్లో నిర్మించుకున్న కట్టడాలు, అక్రమ కట్టడాల వివరాలను టిఎస్ బిపాస్ ద్వారా నమోదు చేసుకోవాలని పురపాలక శాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆయా ఇళ్లకు సంబంధించిన వివరాలను యజమానులు స్వచ్ఛందంగా నమోదు చేయాలని అధికారులు సూచించారు. అందులో ఒకవేళ అక్రమ కట్టడాలుంటే దానికి తగ్గట్టుగా జరిమానాలను విధిస్తామని పురపాలక శాఖ అధికారులు తెలిపారు. ఒకవేళ అక్రమ కట్టడాలు నిర్మించి ముందుకురాని యజమానులను పురపాలక సిబ్బంది గుర్తిస్తే మాత్రం భారీగా జరిమానాలను విధిస్తామని ఆయన హెచ్చరించారు. 2018 సంవత్సరంలో మేజర్ గ్రామ పంచాయతీలను 68 మున్సిపాలిటీలను కొత్తగా ఏర్పాటు చేయడంతో పాటు 131 గ్రామపంచాయతీలను కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. ఈనేపథ్యంలో ఆయా గ్రామాల్లో నిర్మించుకున్న ఇళ్లకు సంబంధించి వివరాల గురించి పురపాలక సిబ్బంది ఆరా తీస్తున్నారు.

ఆయా గ్రామ పంచాయతీల్లో ఇళ్లు కట్టడానికి అనుమతి ఎప్పుడు తీసుకున్నారు, ప్రస్తుతం నిర్మాణం ఎలా జరిగింది, ఎంతమేర అక్రమ కట్టడాలను నిర్మించారన్న వివరాలతో కూడిన జాబితాను అధికారులు తయారు చేస్తున్నారు. ఆ జాబితా ఆధారంగా ముందుకు రాని యజమానులను గుర్తించి వారికి భారీ జరిమానాలను విధించాలని పురపాలక శాఖ అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగానే కట్టడాలు, అక్రమ కట్టడాలు నిర్మించిన యజమానులకు ఒకసారి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో అధికారులు ముందుకెళుతున్నారు. దీనికి సంబంధించి పురపాలక శాఖ అధికారులు ప్రభుత్వ మోమె నెంబర్ 420/2021/ఎంఏయూడి, తేదీ 27.12.2021 ద్వారా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం వీటి ద్వారా భారీగా పురపాలక శాఖ ఆదాయం రానుందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News