Friday, November 22, 2024

పాలిటెక్నిక్ కళాశాల నుంచే రాజకీయాల్లో అడుగు పడింది: మంత్రి హరీశ్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో ఆగస్టు 12, 13 న నిర్వహించే పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మొదటి అడుగుగా పైలాన్ ఏర్పాటుకు భూమి పూజ చేసుకోవడం సంతోషంగా ఉందని ఆర్థిక, వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం మాసబ్ ట్యాంక్ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో డైమండ్ జూబ్లీ స్మారక స్థూపం (పైలాన్) నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ కాలేజిలో నాకు అడ్మిషన్ దొరకడంతో రాజకీయాల్లో అడుగుపడిందని, సమీపంలో ఉందని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉండి చదువుకోవాలని సీఎం కేసీఆర్ గారు చెప్పారు.

Also Read: మే 5న ఇతర భాషల్లో బ్లాక్ బస్టర్ ‘విరూపాక్ష’..

అలా రాజకీయ జీవితం ప్రారంభం అయ్యిందన్నారు.నిధుల కొరత లేదు, ఎంతో మందిమి ఈ కాలేజిలో చదివి ఉన్నత స్థితిలో ఉన్నాం. అందరి బాధ్యతగా తలా ఒక చేయి వేసి కాలేజీని అభివృద్ధి చేసుకుందాం. పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించాలి, అందరిని భాగస్వామ్యం చేయాలని సూచించారు. నా సంపూర్ణ సహకారం ఉంటుంది. విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులను కూడా ముందుగానే ఆహ్వానించి వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసుకొని సమన్వయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, పూర్వ విద్యార్థులు, కాలేజీ ప్రిన్సిపాల్ రాజేశ్వరి తదితరులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News