Sunday, December 22, 2024

అలరించిన భజన భక్తిగీతాల గానామృతం పాటల పోటీలు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో శ్రీఅవదూతేంద్ర మణికంఠ భజన బృందం వ్యవస్తాపకులు, ప్రముఖ భక్తి పాటల గాయకులు నాగసాయి ఆధ్వర్యంలో నిర్వహించిన భజన భక్తి గీతాలు గానామృతం పాటల పోటీలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రచయిత, గాయకులు కేశ వ గురుస్వామి, రమణ గురుస్వామి, బలగం మూవీ ఫేమ్, జబర్దస్త్ కర్తానందం, సీనియర్ సీని నటులు, మెగా రికార్డ్ క్రియేషన్స్ అధినేత పి. శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇలాంటి భక్తి కార్యక్రమాలు మానసిక ప్రశాంతతకు ఎంతో ఉపయోగపడతాయని, సంస్కృతులను, సాంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం మన బాధ్యత అన్నారు.

గాయకులకు ప్రోత్సహమిచ్చే ఇలాంటి కార్యక్రమాలు తరచూ జరగాలని సూచించారు. ఐదు విబాగాలలో నిర్వహించిన ఈ పోటీలకు 40 మంది గాయకులు హాజరవ్వగా మొదటి బహుమతిని కంబాల శ్రీనివాసరావు (హుజూర్‌నగర్), రెండో బహుమతిని మన్నేపల్లి మల్లికార్జున్ (ఖమ్మం), మూడవ బహుమతిని పెరుగు సైదులు (కామేపల్లి), నాలుగో బహుమతిని బొడ్డు సంపత్ ( బంగ్లా), ఐదవ బహుమతిని బెందు వాసుదేవ వెంకటేశ్వర్లు (బాణాపురం), ప్రత్యేక ప్రోత్సాహక బహుమతులు వంశీ త్రినాధ్, పెద్దపాక విజయ్, గొట్టుపర్తి పార్దు, శ్రీవెంకట గోదాదేవిలు అందుకున్నారు. ప్రఖ్యాత కమెడియన్ మొగిలి గుణకర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా కోదాడకు చెందిన ఆదిత్య మ్యూజికల్ బాద్యులు కొండలరావు మాస్టర్, ప్రముఖ గాయని పుసులూరి శ్రీలత, వనం సూర్య ప్రకాష్‌లు వ్యవహరించారు. చివరగా పలువుర్ని శాలువాలతో ఘనంగా సత్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News