Saturday, April 5, 2025

అలరించిన బాస్కెట్‌బాల్ పోటీలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ అభిమానులను కనువిందు చేసింది. హైదరాబాద్‌లోని సెయింట్ పాల్స్ హైస్కూల్‌లో బ్రదర్ జగన్‌మోహన్ రెడ్డి, బ్రదర్ రవికుమార్ రెడ్డి స్మారక ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నీని నిర్వహించారు. ఈ టోర్నీ లో జంటనగరాల్లోని వివిధ పాఠశాలకు చెందిన బాలబాలికల జట్లు పోటీ పడ్డాయి.

బాలుర విభాగంలో చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ టైటిల్‌ను సాధించింది. ఫైనల్లో చిరెక్ స్కూల్ 5442 పాయింట్ల తేడాతో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ టీమ్‌ను ఓడించింది. బాలికల విభాగంలో ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ టైటిల్ సాధించింది. ఫైనల్లో ఫ్యూచర్ స్కూల్ జట్టు 3026 తేడాతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (ఖాజాగూడ)ను ఓడించింది. విజేతలకు బ్రదర్ సుధాకర్ రెడ్డి, బ్రదర్ లంబర్ట్ తదితరులు ట్రోఫీలను బహూకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News