Sunday, December 22, 2024

ఫ్యామిలీ డ్రామాతో పాటు వినోదం

- Advertisement -
- Advertisement -

Entertainment along with family drama

మహిళలు ఎక్కువగా ఉండే ఉమ్మడి కుటుంబంలో వారసుడిగా ఒకే మగాడు ఉంటే అతనిపై వారి ఆప్యాయతలు, అనురాగాలు ఎలా ఉంటాయనే పాయింట్‌తో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రం రూపొందిందని చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి తెలిపారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విశేషాలు…

అందరికీ కనెక్ట్ అవుతాయి…
దర్శకుడు కిషోర్ తిరుమల చెప్పిన ఉమ్మడి కుటుంబంలోని ఆప్యాయతలు కథ నాకు బాగా నచ్చింది. పది మంది మహిళలు ఉన్న కుటుంబంలో ఒకే మగాడు ఉంటే అతనిపై ఉన్న ప్రేమతో అతనికి తెలియకుండా ఇబ్బంది పెట్టే సన్నివేశాలను ఈ సినిమాలో బాగా చూపించాం. ఇవి అందరికీ కనెక్ట్ అవుతాయని చెప్పగలను.
మంచి కథతో…
శర్వానంద్‌తో రెండవ సినిమా ఇది. అతనితో చేసిన ‘పడి పడి లేచె మనసు’ అనుకున్నంతగా ఆడలేదు. అందుకే ఇప్పుడు మంచి కథతో ఈ సినిమా చేశాం. కథ ప్రకారం హీరోయిన్ రష్మిక అయితే బాగుంటుందని ఆమెను ఎంపికచేశాం.
కావాల్సినంత వినోదం…
‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రం కోవిడ్ తర్వాత కుటుంబాలను థియేటర్లకు తీసుకువస్తుందనే నమ్మకం ఉంది. ఈ చిత్రంలో ఫ్యామిలీ డ్రామాతో పాటు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. హీరోహీరోయిన్ల మధ్య జరిగే సన్నివేశాలు మంచి వినోదాన్ని పండిస్తాయి.
అదే నా లక్షం…
ఈ చిత్ర కథ రాజమండ్రిలో జరుగుతుంది. అందుకే ఆ చుట్టుపక్కల ప్రాంతాలైన అన్నవరం, అంతర్వేది తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. ఇక నిర్మాతగా మంచి సినిమాలు చేయడమే నా లక్షం.
అద్భుతమైన ట్యూన్స్…
దేవిశ్రీ ప్రసాద్ నాలుగు పాటలకు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. ఇవి ఆదరణ పొందాయి. ఐదవ పాట కూడా ఉంది. అది నేరుగా సినిమాలో చూస్తే మరింత బాగుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News