Monday, December 23, 2024

‘సరిపోదా శనివారం’ తొలి రోజు ఓపెనింగ్ కలెక్షన్ రూ. 9 కోట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  నటుడు నాని నటించిన ‘సరిపోదా శనివారం’ సినిమా గురువారం దేశంలో ఓపెనింగ్ కలెక్షన్ రూ. 9 కోట్లు రాబట్టింది. ఈ సినిమాకు దర్శకుడు వివేక్ ఆత్రేయ.  ఈ సినిమాను డివివి ఎంటర్ టైన్ మెంట్ రూపొందించింది. ఈ సినిమాలో నాని, ప్రియాంక మోహన్, ఎస్ జె. సూర్య, అభిరామి, ఆదితి బాలన్, పి. సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, మురళీ శర్మ, అజయ్ ఘోష్ నటించారు.

ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలయింది.  రిపోర్టు ప్రకారం ఈ సినిమా ఓపెనింగ్ రోజున తెలుగులో రూ. 8.75 కోట్లు, తమిళ్ లో 24 లక్షలు, మలయాళం లో రూ. 1 లక్ష, హిందీలో …, కన్నడలో రూ. 1.1 కోట్లు ఆర్జించింది.  తెలుగు రాష్ట్రాల్లో గురువారం ఆక్యుపెన్సీ 53.54 శాతంగా ఉంది.

కథ విషయానికి వస్తే…సూర్య(నాని)కి చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువ. ఆ కోపాన్ని అదుపులో పెట్టేందుకు అతడి తల్లి చనిపోతూ కోపాన్ని అదుపులో పెట్టుకోమని  మాట తీసుకుంటుంది. అప్పటి నుంచి కోపాన్ని వారమంతా నియంత్రించుకుంటూ ఒక్క శనివారం మాత్రం కోపానికి కారణమైన వారి భరతం పడుతుంటాడు. అంతా లెక్క రాసుకుని మరి భరతం పడుతుంటాడు. సూర్యకు ఉన్న కోపం సోకులపాలేనికి ఎలాంటి మేలు చేసిందన్నది తెరపైనే చూడాలి. ఇదో యాక్షన్ డ్రామా సినిమా అనే చెప్పాలి. సినిమా ఆరంభం కాస్త స్లోగానే మొదలవుతుంది. కానీ తర్వాత పుంజుకుంటుంది. ఈ సినిమాలో ప్రతి పాత్ర వెనుక ఒక కథ ఉంటుంది. ప్రేక్షకుడిని సినిమాలో లీనం చేసే ఎలిమెంట్స్ ఈ సినిమాకు ఉన్నాయి. స్క్రీన్ ప్లే బాగుంది, సినిమాలో కావలసినంత డ్రామా ఉంది. సినిమా చూడొచ్చు.

సినిమా రేటింగ్: 3/5

రివ్యూ: అశోక్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News