Saturday, November 16, 2024

అభివృద్ధి పనులకు ఆకర్షితులై భారీ చేరికలు

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరిన 65 కుటుంబాలు

ఖానాపురం: నర్సంపేట నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌లో చేరడం రివాజుగా మారిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఖానాపురం మండల కేంద్రంలోని ఎంపీపీ వేములపల్లి ప్రకాష్‌రావు నివాసంలో వివిధ పార్టీల నుంచి 65 కుటుంబాలు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే గులాబి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నర్సంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వృద్ధ నాయకులు ఏపాటి అభివృద్ధి చేశారో జనాలకు స్పష్టం చేయాలన్నారు. ఖానాపురం మండలం నుంచి పక్క మండలానికి కలిపే రోడ్డు నిర్మాణం చేయలేని నాయకుల పనిని నేను ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికై వెంటనే మున్నేరు వాగుపై రూ. 40 కోట్ల వ్యయంతో చెన్నారావుపేట, తిమ్మరాయనిపహాడ్ రెండు బ్రిడ్జి నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు.

వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు రూ. 6.44 కోట్ల పరిహారం ఈనెల 25 నుంచి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు ఎలాంటి తారతమ్యం లేకుండా అందిస్తున్న ఘనత బీఆర్‌ఎస్ పార్టీదేనన్నారు. ఖానాపురం మండల ప్రజలు చైతన్యవంతులని నా కంటే ముందు.. నేను వచ్చిన తరువాత జరిగిన అభివృద్ధిని మీరే వేదికగా అందరికీ తెలియపర్చాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాష్‌రావు, మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకనర్సయ్య, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, ఎంపీటీసీ మర్రి కవిత, ఉపసర్పంచ్ మేడిద కుమార్, సొసైటీ డైరెక్టర్ నీలం సాంబయ్య, సోషల్ మీడియా మండల కన్వీనర్ దాసరి రమేశ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు మచ్చిక అశోక్, ఆర్‌ఎస్‌ఎస్ సభ్యుడు బొప్పిడి పూర్ణచందర్‌రావు, నాయకులు నాగార్జునరెడ్డి, శ్రీనివాస్, పూలునాయక్, పూర్ణచందర్‌రావు, రాజు, రమేశ్, అజ్‌హర్, గులాం మహ్మద్, నజీర్, రాజు, రవి, రామస్వామి, సురేష్, వెంకటేశ్వర్లు, సుధాకర్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News