Sunday, January 19, 2025

కశ్మీరీ పండిట్లకు అండగా యావద్దేశం

- Advertisement -
- Advertisement -

Entire country stands with you: Arvind Kejriwal

కేజ్రీవాల్ భరోసా

న్యూఢిల్లీ: జేష్ట అష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కశ్మీరీ పండిట్లకు బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంతోష, విషాద సమయంలో యావత్ దేశమంతా కశ్మీరీ పండిట్లకు అండగా ఉంటుందని కేజ్రీవాల్ తెలియచేశారు. కశ్మీరులో కశ్మీరీ పండిట్లపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. జ్యేష్ట అష్టమి సందర్భంగా కశ్మీరీ పండిట్లకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని, ఖీర్ భవానీమాత శుభాశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నానని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కశ్మీరీ పండిట్ల వరుస హత్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ గత కొద్ది రోజులుగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు జూన్ 5న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జన ఆక్రోశ్ ర్యాలీ నిర్వహించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News