Wednesday, December 18, 2024

వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ దాడిలో మొత్తం కుటుంబం హతం

- Advertisement -
- Advertisement -

ఇద్దరు పిల్లలతో సహా నలుగురు మృతి
బంధువుల వెల్లడి
తుల్కరెం (వెస్ట్ బ్యాంక్) : పాలస్తీనా తీవ్రవాదులు లక్షంగా వెస్ట్ బ్యాంక్‌లోని ఒక కేఫ్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఇద్దరు చిన్న పిల్లలు సహా నలుగురు కుటుంబ సభ్యులు మరణించారని వారి బంధువులు శుక్రవారం ‘ఎపి’ వార్తాసంస్థతో చెప్పారు. తుల్కరెం కాందిశీకుల శిబిరంలోపి మూడంతస్తుల భవనాన్ని గురువారం అర్ధరాత్రి క్షిపణి దాడి జరిగిందని, దానితో భవనం దగ్ధమైందని, ఒక పాప్యులర్ కేఫ్ ధ్వంసమైందని, కనీసం 18 మంది పాలస్తీనియన్లు హతులయ్యారని ఆ ప్రాంత ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలియజేసింది.

సుమారు ఒక సంవత్సరం క్రితం ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలైన నాటి నుంచి వెస్ట్ బ్యాంక్‌లో ఇదే అత్యంత ప్రాణాంతక దాడి. మృతుల్లో అబు జహ్రా కుటుంబం ఉందని, బేకరీ శ్రామికుడు ముహమ్మద్, అతని భార్య సజా, వారి ఇద్దరు పిల్లలు షామ్ (8), కరమ్ (6) కూడా ఉన్నారని అతని సోదరుడు ముస్తఫా అబు జహ్రా చెప్పాడు. ఆ కుటుంబం కాఫీ షాపుపై నివసిస్తున్నదని ముస్తఫా తెలిపాడు. కాగా, తమ దాడిలో శిబిరంలోని హమాస్ నేత సహా పలువురు తీవ్రవాదులు హతమయ్యారని ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. పాలస్తీనా తీవ్రవాద కేంద్రంగా భావిస్తున్న తుల్కరెం వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెలీ మిలిటరీ దాడులకు తరచు లక్షం అవుతూ ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News