Monday, January 20, 2025

గురుకులాల్లో ప్రవేశాలకు గడువు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేశారు. సాంఘీక, గిరిజన, బిసి, తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు టిజిసెట్ 2023 కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌ను నిర్వహించారు. ఈ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారి ఆధారంగా 202324 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతిలో ప్రవేశాలకు తొలి జాబితాను విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థులు జూన్ 10 లోగా కేటాయించిన పాఠశాలల్లో చేరాలని ఇదివరకు సూచించారు. అయితే పాఠశాలల్లో చేరే గడువును జూన్ 15 వరకు పొడిగించినట్లు గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రరోస్ తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News