Sunday, December 22, 2024

ఎనుమాముల మార్కెట్ కు గొప్ప చరిత్ర ఉంది: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

వరంగల్: తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నాయకత్వంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయని పోలీసులకు గౌరవం పెరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా శాంతిభద్రతలు పటిష్టంగా నిర్వహించాలని, పోలీసుల పరిపాలనలో ప్రజాప్రతినిధులు ఎలాంటి జోక్యం చేసుకోమన్నారు. ప్రజల పక్షం, న్యాయం పక్షం వహించి ప్రజల మెప్పు పొందాలని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పోలీసులకు చెప్పారు. ఆసియాలోని అతిపెద్ద వరంగల్ ఎనుమాముల మార్కెట్ దగ్గర ఎనుమాముల పోలీస్ స్టేషన్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడారు.

ఎమ్మెల్యే రమేష్ తమతో పట్టుపట్టి ఈ పోలీస్ స్టేషన్ సాధించుకున్నారని, ఇక్కడి పోలీస్ సిబ్బంది, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో సిపి బాగా పని చేశారని, ఇప్పుడున్న సిపి అంతకు మించి చేయాలన్నారు. భూదందాలు, క్రైమ్ బాగా హ్యాండిల్ చేయాలన్నారు. కొత్తగా వచ్చిన సిపి గతంలో బాగా చేశారని సిఎం కెసిఆర్ ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారని, కొత్త పోలీస్ స్టేషన్ సిఐ చేరాలు బాగా పని చేయాలన్నారు. తెలంగాణ రాక ముందు ఎలా ఉండేదని, తెలంగాణ వచ్చిన తరువాత ఎలాంటి అభివృద్ధి జరిగిందనేది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. వరంగల్ జిల్లా జీప్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా తాను పని చేశానని గుర్తు చేశారు.

అప్పట్లో పోలీస్ స్టేషన్ కు జీప్ లేకపోతే తాను జీప్ పెట్టానని, అలా వారానికి ఒక జీప్ తానే పెట్టేవాడనని, అప్పట్లో పోలీస్ స్టేషన్ కి వసతులు కూడా ఉండేవి కాదన్నారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు కారు ఇచ్చి, దానికి ఖర్చులు ఇచ్చి, సిఎం కెసిఆర్ ఒక్కో పోలీస్ స్టేషన్ కి 20 నుంచి 50 వేలు నిర్వహణ ఖర్చు ఇచ్చి పోలీస్ స్టేషన్ గౌరవం పెంచారని ప్రశంసించారు. హోమ్ గార్డు జీతం కూడా 12 వేల నుంచి 20 వేలకు పెంచారని, పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో కేసులు తొందరగా విచారించి, వెంట వెంటనే పరిష్కారం చేస్తున్నారని ఎర్రబెల్లి ప్రశంసించారు. ఈ మార్కెట్ చాలా ముఖ్యమని, రైతులకు సంబంధించిన మార్కెట్ ఇది అని, ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంటే వారికి బాగా ఉపయోగమని, ఎన్టి రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు దోనపూడి రమేష్, నారాయణ రావు ఉన్నపుడు ఇక్కడ పెద్ద మార్కెట్ కట్టారని కొనియాడారు.

దీనికి గొప్ప చరిత్ర ఉందని, దానిని కాపాడాలని, సిఎం కెసిఆర్ రైతులకు బాగా ప్రాధాన్యత ఇచ్చారని, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు ఇస్తున్నారని ఎర్రబెల్లి ప్రశంసించారు. ఈ రోజే రైతుబంధు కోసం 6వేల కోట్ల రూపాయలు విడుదల చేశామని, రైతులకు 365 రోజులు కాలువ నీళ్ళు, కరెంట్ ఇచ్చిన మహానుభావుడు కెసిఆర్ మెచ్చుకున్నారు. ప్రభుత్వం వారికి అన్ని చేస్తుందని, పోలీసుల సహకారం కూడా ఉండాలని, పోలీసుల అడ్మినిస్ట్రేషన్ లో తాము జోక్యం చేసుకోమని, న్యాయం పక్షం వహించాలన్నారు. జెన్యూన్ గా పని చేయండని, ప్రజల మెప్పు పొందాలని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పోలీసులకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News