Sunday, February 23, 2025

ఈనెల 5వ తేదీన ఓయూలో పర్యావరణ అవగాహన వాక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈనెల 5వ తేదీన ఉదయం 7 గంటలకు యూనివర్సిటీ కళాశాల ఆఫ్ ఆర్ట్, సోషల్ సైన్స్ నుండి ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్‌లోని ఎన్‌ఎస్‌ఎస్ గేట్ వరకు నడకను నిర్వహించాలని విశ్వవిద్యాలయం నిర్ణయించింది. వ్యర్థాల మూలాల విభజనపై అవగాహన కల్పించడంతోపాటు క్యాంపస్‌ను లిట్టర్ ఫ్రీ క్యాంపస్‌గా జీరో ప్లాస్టిక్ టు ల్యాండ్ ఫిల్ క్యాంపస్‌గా రూపొందించే దిశగా చర్యలు చేపటినట్లు రిజిస్ట్రార్ తెలిపారు.

దీనికి సంబంధించి, ఉస్మానియా విశ్వవిద్యాలయం దాని అనుబంధ కళాశాలల విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది అందరూ ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించే అవగాహన నడకకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం డైరెక్టర్ కార్యాలయాన్ని ఫోన్ నంబర్ 8331997140 సంప్రదించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News