Monday, December 23, 2024

పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్సీ యాదవరెడ్డి

గజ్వేల్: నడకతో ఆరోగ్యం చెత్త ఏరి వేతతో స్వచ్చ పట్టణాన్ని తయారు చేసుకోవచ్చని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. చెత్త ఏరివేత కార్యక్రమం ద్వారా మరో సంస్కరణకు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ శ్రీకారం చుట్టిందని అన్నారు. సోమవారం పట్టణంలోని 18వ వార్డులోని వెంకటేశ్వర ఆలయం వద్ద నడుస్తూ చెత్త ఏరి వేత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డితో పాటు గడ ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నేతి రాజమౌళి గుప్తా, వైస్ చైర్మన్ జక్కియోద్దిన్‌లు పాల్గొని మురికి కాల్వలో పేరుకపోయిన ప్లాస్టిక్ కవర్లు, చాయ్ గ్లాసులను స్వయంగా ఎత్తిన చెత్తను సంచిలో వేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విద్యాదర్, జడ్పిటిసి పంగ మల్లేశం, బిఆర్‌ఎస్ పట్టణ అద్యక్షుడు నవాజ్ మీరా, మండల పార్టీ అధ్యక్షుడు బెండె మధు, కౌన్సిలర్లు , కో ఆప్షన్ సభ్యులు, డైరెక్టర్లు, నాయకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News