Monday, January 20, 2025

ఇక పాలమూరు పరుగులు

- Advertisement -
- Advertisement -

ఎట్టకేలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీటి పథకానికి మోక్షం లభించింది. సాగునీటి పారుదల రంగంలో దక్షిణ తెలంగాణ ప్రాంత రూపురేఖలు మార్చే ఈ ప్రాజెక్టు పనులకు పర్యావరణ అనుమతులు లభించాయి. గోదావరి నదీ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి జీవనాడిగా నిలిచిన కాళేశ్వరం ఎత్తిపోతల పధకం తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ విజయాల ఖాతాలో ఇప్పుడు పాలమూరురంగారెడ్డి పథ కం కూడా చేరిపోయింది. అవిశ్రాంతంగా అలుపెరుగని పోరాటం చేసిన రా్రష్ట్ర ప్రభుత్వం కృషి ఫలించడంతో రాష్ట్ర రైతాంగం సంబురాల్లో మునిగిపోతోంది. కృష్ణా ఉపయోగించుకుని కరువు ప్రాంతమైన దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు బిఆర్‌ఎస్ సర్కారు ఈ పథకాన్ని చేపట్టింది. శ్రీశైలం రిజర్వాయర్ వెనుక జలాల 60రోజుల్లో 90టిఎంసిల నీటిని ఎత్తిపోసేలా పాలమూరు రంగారెడ్డి పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది.

నాగర్‌కర్నూలు జిల్లాలో 1.03లక్షల ఎకరాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 2.35లక్షల ఎకరాలు, వికారాబాద్ జిల్లాలో 3.42 లక్షల ఎకరాలు, నారాయణపేట్ జిల్లాలో 1.6లక్షల ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 0.3లక్షల ఎకరాలకు కలిపి మొత్తం ఈ ప్రాజెక్టు ద్వారా 12.30లక్షల ఎకాలకు సాగునీరు అందనుంది. మార్గమధ్యంలో గ్రామాలతో హైదరాబాద్ మహానగర ప్రజలకు కూడా తాగునీరు అందించడం, పరిశ్రమల ఆవసరాలకు కూడా నీటి కేటాయింపులు చేశారు. ఇంతటి బృహత్ కార్యాన్ని భుజాలకెత్తుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర ఖజానాలో నిధులు అంతంత మాత్రమే ఉన్నా ఏమాత్రం వెనుదీయకుండా ముందడుగేశారు. ఆర్థ్ధిక సంస్థల ద్వారా రుణం సేకరించి అనుకున్న లక్షం మేరకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేయాలని సంకల్పించారు. అయితే ఈ ప్రాజెక్టు అక్రమం, లేవంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైంధవుడిలా ప్రాజెక్టు పనులకు అడ్డుపడింది.

పర్యావరణ అనుమతలు ఇవ్వవద్దంటూ గ్రీన్‌ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ మాటలు నమ్మిన గ్రీన్‌ట్రిబ్యునల్ కూడా ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో శరవేగంగా సాగుతూ వచ్చిన ప్రాజెక్టు పనులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం పనులు తాగునీటి అవసరాలకు మాత్రమే చేపడుతున్నట్టు గ్రీన్‌ట్రిబ్యునల్‌కు విన్నవించడంతో ట్రిబ్యునల్‌లో ఉపశమనం లభించింది. ఎపి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొడుతూ బిఆర్‌ఎస్ సర్కారు అవిశ్రాంతంగా పోరాడుతూ ఎట్టకేలకు పర్యావరణ అనుమతులు సాధించుకోగలిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News