Saturday, January 11, 2025

దశాబ్దాల కల సాకారం మంత్రి హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

పాలమూరు-రంగారెడ్డి పథకం కుట్రలను ఛేదించి, అధిగమించిందని పాలమూరు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులపై మంత్రి హరీశ్ ట్విట్టర్ ద్వారా హర్షం వ్య క్తం చేశారు. దశాబ్దాలుగా అన్యాయానికి, వివక్షకు గురైన పాలమూరుకు కృష్ణమ్మ ప రుగుపరుగున రానుందన్నారు. ఇది సిఎం కెసిఆర్ సాధించిన మరో అపూర్వ చారిత్రా త్మక విజయమన్నారు. ఆయన మొక్కవోని దీక్షకు ప్రభుత్వం పట్టువిడవని ప్రయత్నం తోడై సాధించిన ఫలితమని కొనియాడారు. ఇది మాటల్లో వర్ణించలేని మధుర ఘట్టం అన్నారు. పాలమూరు బీళ్ల దాహార్తిని తీర్చే ప్రజల తలరాతను మార్చే ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రావడం అపూ ర్వ ఆనందాన్ని ఇస్తున్నదని మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News