Saturday, November 23, 2024

పర్యావరణానికి రక్షణేది?

- Advertisement -
- Advertisement -

ప్రకృతిలో మనిషి కూడా ఒక భాగం. అంతే కానీ, ప్రకృతి మనిషి కోసం కాదు. మనిషి శరీరం లాగానే వాతావరణానికి కూడా బ్యాలెన్స్ అవసరం. కానీ, ఆ సంతులనం నిలిపేందుకు మనిషి తనవంతుగా ఎలాంటి కృషి చేయడం లేదు. పైగా.. తెలిసో తెలియకో చేస్తున్న తప్పుల వల్ల ప్రస్తుతం వున్న ఆ కాస్త బాలెన్స్ కూడా చెడగొడుతున్నారు. క్రమపద్ధతి లేకుండా వనరులని ఇష్టానుసారంగా వాడేయడం, కాలుష్యం, అవసరం వున్నా లేకపోయినా వస్తువుల్ని కొనడం, వాడి పారేసే అలవాట్ల వల్ల పర్యావరణం మీద ఒత్తిడి పెరుగుతోంది. కార్బన్‌డయాక్సైడ్ ప్రధానంగా శిలాజ ఇంధనాలను మండించడం వలన ఉత్పత్తి అవుతుంది. సిమెంటు ఉత్పత్తిలోను, ఉష్ణమండల అరణ్యాలను కొట్టెయ్యడం వలన కూడా ఇది ఉత్పత్తి అవుతుంది. మౌనాలోవా అబ్సర్వేటరీలో చేసిన అధ్యయనాల ప్రకారం 1960లో 313 పారట్స్ పర్ మిలియన్‌గా ఉన్న కార్బన్‌డయాక్సైడ్ (పిపిఎమ్), 2013 మే 9 నాటికి 400 పిపిఎమ్ స్థాయిని దాటింది. దహన క్రియలో ఉద్భవించే కార్బన్ డయాక్సైడ్ ప్రపంచ వ్యాప్త శీతోష్ణస్థితిపై చూపే ప్రభావాన్ని కాలెండర్ ప్రభావం అని కూడా అంటారు.

శీతోష్ణస్థితి మార్పులపై అంతర్జాతీయ పానెల్ (ఐపిసిసి) ఐదవ మదింపు నివేదికలో ‘20 వ శతాబ్దం మధ్యకాలం నుండి ఏర్పడిన ఉషోగ్రతల పెరుగుదలకు అతి ముఖ్యమైన కారణం మానవుడే అనడానికి ఎంతో అవకాశం ఉంది’ అని చెప్పింది. కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారమే అతిపెద్ద మానవ ప్రభావం.నివేదికలో సంగ్రహించిన శీతోష్ణస్థితి నమూనా అంచనాలు, భవిష్యత్తు గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల రేటు, శీతోష్ణస్థితి ప్రతిస్పందనలపై ఆధారపడి, 21వ శతాబ్దంలో ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రతలు అత్యల్పంగా 0.3 to 1.7 ఒ C (0.5 to 3.1 ఒF) వరకూ, అత్యధికంగా 2.6 to 4.8 ఓC (4.7 to 8.6 ఒ F) వరకూ పెరిగే అవకాశం వుందని సూచించాయి. ఈ పరిశోధనలను ప్రధాన పారిశ్రామిక దేశాల జాతీయ సైన్స్ అకాడమీలు గుర్తించాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలకు చెందిన ఏ శాస్త్రీయ సంస్థ కూడా ఈ సూచనలపై విభేదించలేదు. గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలలో సముద్ర మట్టాలు పెరగడం, అవపాతంలో ప్రాంతీయ మార్పులు, వేడితరంగాల వంటి తీవ్ర శీతోష్ణస్థితి సంఘటనలు, ఎడారుల విస్తరణ వున్నాయి. మహాసముద్రాల ఆమ్లీకరణ కూడా గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల వల్ల సంభవిస్తుంది. ఇది ఉష్ణోగ్రతల వలన జరగనప్పటికీ సాధారణంగా ఆ ప్రభావాల తోటే దీన్నీ కలిపి చూస్తారు. ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుదల ఆర్కిటిక్‌లో అత్యధికంగా ఉంది.

ఇది హిమానీనదాలు, శాశ్వత మంచు, సముద్రపు మంచుల తిరోగమనానికి కారణమౌతోంది. మొత్తం మీద, అధిక ఉష్ణోగ్రతల వలన ఎక్కువ వర్షం, హిమపాతం కలుగుతుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో కరువు, అడవి మంటలు పెరుగుతాయి. శీతోష్ణస్థితి మార్పు వలన పంటల దిగుబడి తగ్గుతుంది, ఆహార భద్రతకు భంగం కలుగుతుంది. సముద్ర మట్టాలు పెరగడంతో తీరప్రాంత మౌలిక సదుపాయాలు మునిగిపోతాయి. అనేక సముద్ర తీర నగరాలను ఖాళీ చేయాల్సి వస్తుంది. పర్యావరణ వ్యవస్థలు మారిపోవడంతో అనేక జాతుల జీవులు అంతరించిపోవడం లేదా వలస పోవడం జరుగుతుంది. తక్షణమే ప్రభావితమయ్యే పర్యావరణ వ్యవస్థల్లో పగడపు దిబ్బలు, పర్వతాలు, ఆర్కిటిక్‌లు ఉన్నాయి. ఒక ప్లాస్టిక్ క్యారీ బాగ్‌లు భూమిలో కలిసిపోడానికి వెయ్యేళ్ళు పడుతుందనే సంగతి మీకు తెలుసా? వాడి పారేసే ఈ ప్లాస్టిక్ సంచుల వల్ల లక్షలాది అమాయకమైన జంతువులు ప్రాణాలు కోల్పోతున్నాయి. మార్కెట్‌కు వెళ్ళేటప్పుడు బ్యాగ్ వెంట తీసుకెళ్లడం అలవాటు చేసుకోండి. వీలైతో పర్మినెంట్‌గా ఒక బ్యాగ్ మీ బైక్ లేదా కారులో ఉండేలా చూడండి. ఈ అలవాటు తప్పకుండా పర్యావరణానికి మేలు చేస్తుంది.

ఒక ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ తయారు చెయ్యడానికి వాడే వనరులన్నింటినీ మనం సేవ్ చేసినట్టే. అలాగే, మూగ జీవుల ప్రాణాలను సైతం కాపాడు గలుగుతాం. ఈసారి బైటికి వెళ్ళే ముందు తీసుకెళ్ళే వస్తువుల పక్కన మీ బ్యాగ్ పెట్టుకోండి. అప్పుడు మర్చిపోయే ప్రసక్తి ఉండదు. అదే విధంగా అడవులు పెంచాలి. అంతర్జాతీయ ఒప్పందాలని గౌరవించాలి. వ్యవసాయంలో రసాయనిక ఎరువులు వినియోగం తగ్గించాలి. అప్పుడే వాతావరణ కాలుష్యం తగ్గుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News