Monday, January 20, 2025

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణను తమ బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉందని బాగుండాలమ్మ ఆల్భమ్ బృందం అభిప్రాయపడింది. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్ కాలేజ్ ప్రాంగణంలో బాగుండాలమ్మ బృంద సభ్యులు మొక్కలు నాటారు. ఈ ఆల్బమ్‌కి దర్శకత్వం వహించిన బుల్లెట్ బండి లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రజలను ప్రేమించే వ్యక్తి నాయకుడైతే ప్రకృతిని ప్రేమించే వ్యక్తి దేవుడు. అయన బాటలో నడుస్తూ కెసిఆర్ స్ఫూర్తితో హరితహారానికి మద్దతుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఎంపి సంతోష్ చేపట్టడం అభినందనీయం. పచ్చదనం పెంపు పైన ప్రజలకు అవగాహన కల్పిస్తూ పర్యావరణ పరిరక్షణకు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News