Tuesday, January 21, 2025

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : శివకార్తికేయన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను నాటి సంరక్షించాలని నటుడు శివకార్తికేయన్ కోరారు. తన కొత్త సినిమా మహావీరుడు సినిమా ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన శివకార్తికేయన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా శనివారం బంజారాహిల్స్‌లోని కెబిఆర్ పార్క్ లో మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మనందరి బాధ్యత అన్నారు. భవిష్యత్ తరాలకు మనం అందించే కానుక.

ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి – నాటించాలని పిలుపునిచ్చారు. ప్రముఖ హీరోయిన్ నందితా శ్వేతా విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కృషిని మనస్పూర్తిగా అభినందిస్తున్నానని వెల్లడించారు. తన మిత్రుడు, తమిళ్ రాక్ స్టార్ అనిరూధ్‌కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఆయన విసిరారు.కార్యక్రమంలో ఏషియన్ సినిమాస్ అధిపతి, సినీ నిర్మాత జాన్వీ నారాంగ్‌తో పాటు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News