Wednesday, January 22, 2025

మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యం

- Advertisement -
- Advertisement -

మరిపెడ: మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోతు సింధూ రవినాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ శతాబ్ధి ఉత్సవాలలో భాగంగా సోమవారం మరిపెడ మున్సిపాలిటీలో హరితోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోతు సింధూర రవినాయక్ మాట్లాడుతూ మానవాళి మనుగడకు మొక్కలు కీలకమన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, చెట్టే జీవరాశి మనుగడకు ఆధారమని, పర్యావరణ పరిరక్షణకు అందరూ విధిగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పచ్చదనంతో తెలంగాణ విరజిల్లాలనే ఆక్షాంక్షతో సిఎం కెసిఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారన్నారు.

మొక్కలు నాటడంతో పర్యావరణ సమతుల్యం ఏర్పడి సకాలంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని తెలిపారు. అప్పుడే మనిషి మనుగడ బాగుంటుందన్నారు. ఎక్కడైతే చెట్లు ఎక్కవగా ఉంటాయో అక్కడ పర్యావరణ పరిరక్షణ ఉంటుందని, మంచి గాలి, వానలు పడి నీరు పుష్కలంగా దొరుకుతుందన్నారు. మొక్కల పెంపకం వల్ల కలిగే ప్రయోజనాలు, పర్యావరణానికి ఏ విధమైన ఉపయోగాలు కలుగుతాయో వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, కమిషనర్ ఏ. రాజు, కౌన్సిలర్లు ఏడెల్లి పరశురాములు, కోఆప్షన్ సభ్యులు ఉప్పల నాగేశ్వర్‌రావు, మక్సూద్, మెప్మా సిబ్బంది, వార్డు ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News