Friday, November 15, 2024

పర్యావరణవేత్త దిశరవి అరెస్ట్..

- Advertisement -
- Advertisement -

పర్యావరణవేత్త దిశరవి అరెస్ట్
రైతులకు మద్దతుగా టూల్‌కిట్ రూపకల్పనలో కీలక పాత్ర
ఖలిస్తాన్ సంస్థతోనూ సంబంధాలు: ఢిల్లీ పోలీసుల ఆరోపణ 

బెంగళూర్/న్యూఢిల్లీ: బెంగళూర్‌కు చెందిన యువ పర్యావరణ కార్యకర్త దిశ రవి(21)ని ఢిల్లీ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. దిశరవిని శనివారమే బెంగళూర్‌లోని సోలాదేవనహల్లిలోని ఆమె ఇంటి నుంచి అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం దిశరవిని ఢిల్లీలోని పాటియాలా కోర్టులో హాజరుపరచగా, ఐదు రోజుల పోలీస్ కస్టడీకి ఆదేశాలిచ్చారు. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో ఆందోళన నిర్వహిస్తున్న రైతులకు మద్దతుగా రూపొందించిన టూల్‌కిట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు దిశరవిపై దేశద్రోహంసహా పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. టూల్‌కిట్ రూపకల్పనలో దిశరవిది కీలక పాత్ర అని పోలీసులు ఆరోపిస్తున్నారు.

ఆమె ఈ టూల్ కిట్ కోసం వాట్సాప్ గ్రూప్ ద్వారా ఖలిస్తాన్ అనుకూల సంస్థ పోయెటిక్ జస్టిస్ ఫౌండేషన్‌తో సంబంధాలు ఏర్పరచుకున్నారని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. ‘ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్’(ఎఫ్‌ఎఫ్‌ఎఫ్) పేరుతో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు, యువకులు చేపట్టిన ప్రచార కార్యక్రమంలో దిశరవి పాల్గొంటున్నారు. బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేసిన దిశరవి గుడ్‌మిల్క్ కంపెనీలోని పోషక నిపుణుల విభాగంలో మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌కు శ్రీకారం చుట్టిన స్వీడన్ యువతి గ్రెటా థన్‌బర్గ్ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా టూల్‌కిట్‌ను రూపొందించారు. అయితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఈ టూల్‌కిట్‌ను రూపొందించారని కేంద్రం ఆరోపించింది. కేంద్రం ఆరోపణల్ని పలువురు ప్రముఖులు ఖండించారు.

Environmentalist Disha Ravi arrested

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News