Tuesday, December 24, 2024

దక్షిణాది మార్కెట్‌లో తమ కార్యకలాపాలను విస్తరించిన ఈప్యాక్‌ ప్రీఫ్యాబ్‌..

- Advertisement -
- Advertisement -

అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రీ ఇంజినీర్డ్‌ బిల్డింగ్‌ (పీఈబీ) పరిష్కారాల ప్రదాత ఈప్యాక్‌ ప్రీఫ్యాబ్‌ , దక్షిణాది మార్కెట్‌లో తమ కార్యకలాపాలను విస్తరించడానికి సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా మంబట్టు పారిశ్రామిక ప్రాంతంలో తమ నూతన గ్రీన్‌ఫీల్డ్‌ తయారీ యూనిట్‌ ద్వారా ఈ విస్తరణ కార్యక్రమాలను ప్రారంభించింది.

తమ నూతన సదుపాయం కోసం శంఖుస్థాపన కార్యక్రమాలను బుధవారం నిర్వహించింది. సుళ్లూరుపేట ఎంఎల్‌ఏ, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ కిలివేటి సంజీవయ్య, పరిశ్రమలు, వాణిజ్య శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్‌ కరికాల్‌ వెలవన్‌, ఐఏఎస్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రూప్‌ ఛైర్మన్‌ బీఎల్‌ బోత్రా, డైరెక్టర్‌ సంజయ్‌ సింఘానియా మరియు డైరెక్టర్‌ నిఖిల్‌ బోత్రా పాల్గొన్నారు. ఈ సంస్ధ తమ తయారీ కేంద్రాన్ని 198 కోట్ల రూపాయల పెట్టుబడితో 20 ఎకరాలలో నిర్మించడం ద్వారా కార్యకలాపాలను విస్తరించనుంది. ఈ నూతన కేంద్రం సంవత్సరానికి 100,000 మెట్రిక్‌ టన్నులను జోడించనుంది.

‘‘ఇప్పటికే రెండు ప్లాంట్‌లు రాజస్తాన్‌లోని ఘిలోత్‌, గ్రేటర్‌ నోయిడాలలో ఉన్నాయి. వీటి మొత్తం సామర్ధ్యం ఒక లక్ష మెట్రిక్‌ టన్నులు. దక్షిణాదిలో కూడా మార్కెట్‌ విస్తరించడంలో భాగంగా ఈ ప్లాంట్‌ ఏర్పాటుచేశాము. ఈ కేంద్రంలో 1000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రస్తుతం దక్షిణాదికి రావాణా చేయడం అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో పాటుగా భవంతి ఖర్చు కూడా పెరుగుతుంది. పీఈబీలు సంప్రదాయ భవంతి ప్రక్రియలతో పోలిస్తే 40% తక్కువ కార్బన్‌ విడుదల చేయడంతో పాటుగా 50% వేగంగా భవంతి పూర్తి కావడంలో సహాయపడతాయి ’’ అని ఈప్యాక్‌ ప్రీఫ్యాబ్‌ డైరెక్టర్‌ నిఖిల్‌ బోత్రా అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News