Monday, December 23, 2024

పిఎఫ్‌పై వడ్డీ రేటు 8.1 శాతానికి తగ్గింపు…

- Advertisement -
- Advertisement -
EPF interest rate reduced to 8.1 percent
నాలుగు దశాబ్దాల కనిష్ఠ స్థాయి

న్యూఢిల్లీ : ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్‌ఒ)లో సభ్యులకు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. సభ్యుల డిపాజిట్లపై వడ్డీ రేటు భారీగా తగ్గించి వేసింది. నాలుగు దశాబ్దాల స్థాయికి కుదిస్తూ శనివారం ప్రతిపాదించింది. 2020 21 లో ఈపీఎఫ్‌వో సభ్యుల డిపాజిట్లపై వడ్డీ రేటు 8.5 శాతం ఉంటే ప్రస్తు ఆర్థిక సంవత్సరంలో దాన్ని 8.1 శాతానికి కుదించి వేసింది. ఈమేరకు శనివారం ప్రతిపాదించినట్టు కేంద్ర కార్మికశాఖ వర్గాలు తెలిపాయి. 1977-78 తరువాత ఇంత తక్కువ వడ్డీ రేటు నిర్ణయించడం ఇదే మొదటిసారి. అప్పట్లో అతి తక్కువగా 8 శాతం వడ్డీ ఇచ్చారు. 2018-19,2016-17లో 8.65 శాతం చొప్పున వడ్డీ జమ చేయగా, 2013-14,2014-15లో 8.75 శాతం చొప్పున ఇచ్చారు.

2015-16 లో 8.8 శాతం చొప్పున జమ చేశారు. అయితే కొవడ్ సమయంలో విత్‌డ్రాలు పెరగడం, చందాదారుల నుంచి జమయ్యే సొమ్ము తగ్గిపోవడంతో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఏడేళ్ల కనిష్ఠానికి తగ్గించి 8.5 శాతంగా ఇచ్చారు. గత ఆర్థిక సంవత్సరానికి (202021)కూడా ఇదే 8.5 శాతం వడ్డీని కొనసాగించారు. ఇప్పుడు 8.1 శాతం మాత్రమే ఉంది. ప్రస్తుతం ఈపీఎఫ్‌ఒ కింద ఐదు కోట్ల మంది సభ్యులు ఉన్నారు. ఈ నెలాఖరునాటికి ఈపీఎఫ్‌వోలో సభ్యుల సంఖ్య 50 మిలియన్లకు చేరుకుంటుంది. ఈపీఎఫ్‌వో నిర్ణయ మండలి కేంద్ర ధర్మకర్తల బోర్డు (సీబీటీ )శనివారం సమావేశమైంది. ఈ భేటీ లోనే పీఎఫ్ వడ్డీ రేటుపై నిర్ణయం తీసుకున్నట్టు ఆయా వర్గాలు పేర్కొన్నాయి. 8.1 శాతం వడ్డీ రేటు నిర్ణయాన్ని సీబీటీ కేంద్ర ఆర్థిక శాఖకు పంపనున్నది. ఆర్థిక శాఖ నుంచి ఆమోదం పొందిన తరువాత చందాదారులకు వడ్డీ జమ చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News