Thursday, December 19, 2024

స్వల్పంగా వడ్డీ రేట్లను పెంచిన ఇపిఎఫ్‌ఒ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరాని(2022-23)కి ప్రభుత్వం పిఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును స్వల్పంగా 0.05 శాతం పెంచింది. దీంతో ఈ రేటు 8.10 శాతం నుండి 8.15 శాతానికి పెరిగింది. ఈమేరకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఇపిఎఫ్‌ఒ) మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం పిఎఫ్‌పై వడ్డీ రేటును 8.10 శాతానికి, అంటే 43 సంవత్సరాలలో కనిష్ట స్థాయికి తగ్గింది. మంగళవారం కేంద్ర కార్మిక శాఖమంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షతన ఇపిఎఫ్‌ఒకు చెందిన నిర్ణయం సంస్థ సెంట్రల్ బోర్డు ట్రస్టీస్(సిబిటి) 8.15 శాతం వడ్డీ రేటును సిఫారసు చేసింది. దేశంలోని దాదాపు 6 కోట్ల మంది ఉద్యోగులు పిఎఫ్ పరిధిలోకి వస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News