Sunday, January 19, 2025

సొంతింటికి వచ్చినట్లు సంతోషంగా ఉంది: ఏపూరి సోమన్న

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సమగ్ర తెలంగాణ అభివృద్ధిలో తన పాట కూడా భాగమవుతుందని గాయకుడు ఏపూరి సోమన్న తెలిపారు. ఏపూరి సోమన్న బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మధుసూదనాచారి గులాబీ కండువా కప్పి సోమన్నను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏపూరి మాట్లాడారు. సిఎం కెసిఆర్ తప్ప తెలంగాణకు ప్రత్యామ్నాయ లేదని, 16 సంవత్సరాలు ఉద్యమంలో పని చేశానని వివరించారు. సొంతింటికి వచ్చినట్లు సంతోషపడుతున్నానని తెలిపారు. కళాకారులను గౌరవించిన గొప్ప వ్యక్తి సిఎం కెసిఆర్ అని ఏపూరి ప్రశంసించారు.

అన్ని వర్గాలను తెలంగాణ అభివృద్ధి ఆకర్షిస్తోందని విప్ బాల్కసుమన్ తెలిపారు. ఆయుధం లాంటి గాయకుడు ఏపూరి సోమన్న అని ఎంఎల్‌సి దేశపతి శ్రీనివాస్ కొనియాడారు. గాయకుడి జాయినింగ్ సభ జరగడం ఇదే తొలిసారి అని దేశపతి ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News