Thursday, January 23, 2025

తెలంగాణలో సర్వ మతాలకు సమాన అవకాశాలు

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక సిఎం కెసిఆర్ నేతృత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని సర్వ మతాలకు సమాన అవకాశాలు కల్పిస్తోందని ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ తెలిపారు. ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పలు దేవాలయాలు, చర్చిల్లో, మజీదుల్లో ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక ప్రార్ధనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెసిఆర్ హిందూ పండుగ బతుకమ్మ కోసం ఆడపడుచులకు బతుకమ్మ చీరలు, ఆలయాల అభివృద్ధ్ది, రంజాన్ సందర్భంగా ముస్లీం సోదరులకు రంజాన్ తోఫాలు, క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్లకు కానుకలు అందించి అన్ని మతాలను సమానంగా గౌరవిస్తున్నారని పేర్కోన్నారు.

రాష్ట్రంలో అన్ని విధాలుగా ఆధ్యాత్మికంగా ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని సర్వ మతాల వారు ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో వివిధ మత పెద్దలు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News