మహబూబ్‌నగర్ బ్యూరో : మహబూబ్‌నగర్ గ్రామీణ మండలం రామచంద్రపురం గ్రామాభివృద్దికి గడచిన తొమ్మిది ఏళ్లలో రూ. 26 కోట్ల 3 లక్షలతో ఖర్చు చేసినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా.వి. శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మం గళవారం ఆయన రామచంద్రపురం గ్రామంలో సుమారు రూ. 50 లక్షల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధ్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రభుత్వాలు రైతులను, పేదలను పట్టించుకోలేదని, తాగడానికి మం చినీళ్లు లేకున్నా ఆడగలేదని, అలాంటిది తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు ఇస్తున్నదని తెలిపారు. ప్రస్తుతం గ్రామాల్లో రైతు లు సంతోషంగా ఉన్నారని, ఎవరికైనా ఆరరోగ్యం బాగా లేకు ంటే ప్రభుత్వ ఖర్చుతో ఉచిత వైద్యం అందించడమే కాక, ము ఖ్యమంత్రి సహయ నిధి కింద ఆర్ధిక సాయం అందిస్తున్నామని, 252 మందికి గ్రామంలో కేసిఆర్ కిట్టు ఇచ్చామని, 18 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 18 లక్షలు ఇచ్చామని తెలిపారు.
అన్ని కులవృత్తులకు ప్రాధాన్యత ఇస్తున్నామని, విద్యార్థులకు హాస్టళ్లలో సన్న బియ్యం ద్వారా భోజనం పెడుతున్నామని మం త్రి తెలిపారు. గ్రామ సర్పంచ్ మన్నెమ్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్‌గౌడ్ , ఎంపీపీ సుధాశ్రీ, వైస్ ఎంపీపీ అనిత, రైతు బంధు డైరెక్టర్ మల్లు నర్సింహరెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు అల్లావుద్దీన్, దేవేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, సర్పంచ్ మల్లికార్జునరెడ్‌డి తదితరులు మంత్రి వెంట ఉన్నారు. అనంతరం ముగ్గురు లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు.